Hyundai EV : హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే- నెక్సాన్​ ఈవీకి పోటీగా..

Electric cars in India : హ్యుందాయ్ తన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2026 చివరి నాటి లేదా 2027లో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం గోవాలో టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు, టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది.

Published on: Mar 16, 2026, 16:00:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని విస్తరించే పనిలో వేగంగా నిమగ్నమైంది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో కనిపించిన హ్యుందాయ్ కొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ.. తాజాగా గోవా వీధుల్లో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రత్యక్షమైంది. ఈ కొత్త ఈవీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి..

హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు.. (Instagram / carxplain08)
హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు.. (Instagram / carxplain08)

హ్యుందాయ్​ నుంచి కొత్త ఎలక్ట్రిక్​ కారు..

ధరల వ్యత్యాసాన్ని తగ్గించే వ్యూహం-

ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న ఈవీల మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉంది.

క్రెటా ఎలక్ట్రిక్: రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఐయోనిక్ 5 : రూ. 46.30 లక్షలు (ఎక్స్-షోరూమ్).

వీటిన్నా తక్కువ ధరలో, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త సబ్-4 మీటర్ ఈవీని హ్యుందాయ్ తీసుకురాబోతోంది.

హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు- భారతదేశంలోనే స్వయంగా అభివృద్ధి..

ఈ కొత్త ఈవీకి ఒక ప్రత్యేకత ఉంది! ఇది పూర్తిగా భారతదేశంలోనే గ్రౌండ్-అప్ నుంచి అభివృద్ధి చేసిన మొదటి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనం కావచ్చని తెలుస్తోంది. అయితే, ఇది ప్రత్యేకమైన 'బోర్న్ ఎలక్ట్రిక్' ప్లాట్‌ఫారమ్‌పై వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు- డిజైన్, ఫీచర్లు..

టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం.. కియా సైరోస్​ తరహాలో ఈ కారు బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.

ఎక్స్‌టీరియర్: మెరుగైన ఎయిరోడైనమిక్స్, ఎఫీషియన్సీ కోసం ప్రత్యేకమైన 'ఎయిరో-ఇన్‌స్పైర్డ్' అలాయ్ వీల్స్‌ను దీనికి అమర్చారు.

ఇంటీరియర్: క్యాబిన్‌లో సరికొత్త డ్యూయల్-స్క్రీన్ లేఅవుట్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం) ఉండే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే ఫీచర్లు ఉంటాయి.

స్టీరింగ్ వీల్: వేన్యూ, వెర్నా మోడళ్లలో చూసినట్లుగా, హ్యుందాయ్ లోగోకు బదులుగా 'నాలుగు చుక్కలు' (Morse code for 'H') కలిగిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ఉండవచ్చు.

హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు- పోటీ..

ఈ ఈవీని 2026కి చివరి నాటికి లేదా 2027లో లాంచ్​ చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. భారత మార్కెట్​లో విడుదలైన తర్వాత, ఇది ప్రధానంగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ ఈవీలతో తలపడనుంది.

ఈ హ్యుందాయ్​ కొత్త ఎలక్ట్రిక్​ కారు పేరు, ధరతో పాటు ముఖ్యమైన రేంజ్​ వంటి వివరాలపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More