...
...
Next Story

భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో హోండా అమేజ్​కి 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​..

భద్రత విషయంలో టాప్​ కార్లలో హోండా అమేజ్ చేరింది! థర్డ్​ జనరేషన్​ హోండా సెడాన్​కి భారత్ ఎన్​సీఏఓపీ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 28, 2025, 14:00:20 IST
Advertisement

ఇండియాలో 5 స్టార్​ సేఫ్టీ రేటింగ్​ ఉన్న వాహనాల సంఖ్య మరింత పెరిగింది! ఈ లిస్ట్​లో ఇప్పుడు హోండా అమేజ్​ సెడాన్​ కూడా చేరింది. ఈ థర్డ్​ జనరేషన్​ హోండా అమేజ్​కి భారత్​ ఎన్​సీఏపీ క్రాష్​ టెస్ట్​లో 5 స్టార్​ రేటింగ్​ లభించింది. ఈ సెడాన్ పెద్దల భద్రత (ఏఓపీ)లో ఐదు స్టార్లను, పిల్లల భద్రత (సీఓపీ)లో నాలుగు స్టార్ల రేటింగ్‌ను అందుకుంది. ఇది భారత మార్కెట్‌లో హోండా బ్రాండ్‌కు ఒక కీలకమైన మైలురాయి అని చెప్పుకోవచ్చు.

The Honda Amaze 3rd gen has scored a 5-star rating in BNCAP's crash testing.
The Honda Amaze 3rd gen has scored a 5-star rating in BNCAP's crash testing.

ఏఓపీ స్కోరు: హోండా అమేజ్ 32 పాయింట్లకు గాను 28.33 పాయింట్లు సాధించింది.

సీఓపీ స్కోరు: 49 పాయింట్లకు గాను 40.81 పాయింట్లు సాధించింది.

ఈ స్కోర్‌లు కాంపాక్ట్ సెడాన్‌లో ఉన్న అన్ని వేరియంట్లకు (వీ, వీఎక్స్​, జెడ్​ఎక్స్​), అలాగే మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లకు వర్తిస్తాయి.

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00 పాయింట్లకు గాను 14.33 పాయింట్లు సాధించింది.

సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00 పాయింట్లకు గాను 14.00 పాయింట్లు సాధించింది.

పిల్లల భద్రత (సీఓపీ) విషయంలో, డైనమిక్ స్కోరులో గరిష్టంగా 24.00 పాయింట్లకు 23.81 పాయింట్లు, సీఆర్​ఎస్​ ఇన్‌స్టాలేషన్ స్కోరులో 12.00 పాయింట్లకు 12.00 పాయింట్లు సాధించింది.

అడాస్​- స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు..

హోండా అమేజ్ 'హోండా సెన్సింగ్' టెక్నాలజీతో వస్తుంది. దీనితో భారతదేశంలో అడాస్​ (అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెన్స్​ సిస్టెమ్​) ఫీచర్ ఉన్న అత్యంత సరసమైన వాహనంగా ఇది నిలిచింది. ఈ వ్యవస్థలో కింది భద్రతా ఫీచర్లు ఉన్నాయి:

  • కొలిజన్-మిటిగేషన్ బ్రేకింగ్
  • అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
  • లేన్-కీపింగ్ అసిస్టెన్స్
  • రోడ్-డిపార్చర్ మిటిగేషన్
  • లీడ్-కార్ డిపార్చర్ అలర్ట్
  • ఆటో హై బీమ్
  • లేన్‌వాచ్ కెమెరా

హోండా అమేజ్ 1.2-లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా స్టెప్డ్-సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది.

మొదటిసారిగా కారు కొనుగోలు చేసే వారికి, యువ కుటుంబాలకు ఆచరణాత్మకమైన, నమ్మదగిన సెడాన్‌గా దీనిని మార్కెట్‌లో ఉంచారు. భారత్ ఎన్​సీఏపీ సాధించిన ఈ బలమైన భద్రతా పనితీరు అమేజ్ అమ్మకాలకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

హోండా ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..

ఈ అద్భుత విజయంపై హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & సేల్స్), కునాల్ బెహ్ల్ మాట్లాడుతూ.. "కొత్త 3వ తరం హోండా అమేజ్, పెద్దల భద్రతకు 5-స్టార్ రేటింగ్, పిల్లల భద్రతకు 4-స్టార్ రేటింగ్ పొందడం మాకు చాలా సంతోషంగా ఉంది. అమేజ్‌ను స్టైలిష్‌గా, సామర్థ్యం ఉన్నదిగా మాత్రమే కాకుండా, భారత రోడ్లపై అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ సెడాన్‌లలో ఒకటిగా మార్చాలనే మా నిరంతర దృష్టిని ఇది ప్రతిబింబిస్తుంది. హోండా అమేజ్‌లో సెగ్మెంట్‌లో మొదటిసారిగా, అత్యంత సరసమైన ధరలో అడాస్​ని అందించడం, ప్రమాదాల నివారణను మరింత పెంచుతుంది. ఇది అందరి భద్రతను మెరుగుపరచాలనే హోండా గ్లోబల్ విజన్‌కు పూర్తిగా అనుగుణంగా ఉంది," అని తెలిపారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe