బడ్జెట్ ధరలో సురక్షితమైన, ఫీచర్ రిచ్ సిటీ కార్ల కోసం చూసే వారిని లక్ష్యంగా చేసుకుని టాటా మోటార్స్ సరికొత్త 2026 టాటా టియాగో (Tata Tiago) ను మార్కెట్లోకి తెచ్చింది. రూ. 4.69 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కారు ఎంట్రీ లెవెల్ 'స్మార్ట్' వేరియంట్ అయినప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకునేలా ఎన్నో ఫీచర్లను జోడించింది. డిజిటల్ క్లస్టర్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో ఉండటం విశేషం.
ఎక్స్‌టీరియర్ డిజైన్

సాధారణంగా బేస్ వేరియంట్ కార్లు లుక్ పరంగా చాలా సింపుల్‌గా ఉంటాయి, కానీ టియాగో స్మార్ట్ వేరియంట్ అలా అనిపించదు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భాగంగా దీనికి సరికొత్త ఫ్రంట్ గ్రిల్ (ఫాసియా), బాడీ-కలర్ బంపర్స్ అందించారు.
లుక్ అండ్ స్టైలింగ్: కారు వెనుక భాగంలో ఎల్‌ఈడీ (LED) టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. కారుకు రగ్గడ్ లుక్ ఇవ్వడం కోసం 'కాస్మో గ్రెయిన్' టెక్స్చర్డ్ వీల్ ఆర్చ్ క్లాడింగ్‌ను ఉపయోగించారు.
పరిమితులు: బేస్ వేరియంట్ కాబట్టి ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, స్టీల్ వీల్స్ మాత్రమే వస్తాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డీఆర్‌ఎల్‌లు (DRLs), బాడీ-కలర్ ఓఆర్‌వీఎంలు (ORVMs) వంటివి పై వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.
ఇంటీరియర్, ఫీచర్లు (Interior & Features)
కారు క్యాబిన్ లోపల సరికొత్త డ్యాష్‌బోర్డ్‌ను 'ఫ్యాబ్రిసియా లక్స్' ట్రిమ్‌తో డిజైన్ చేశారు. టాటా వారి కొత్త స్ట్రీరింగ్ వీల్‌తో పాటు ప్రయాణికులకు మంచి అండర్-థై సపోర్ట్ ఇచ్చే ప్రీమియం మెలంజ్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సీట్లను అమర్చారు.
కొత్త టియాగో బేస్ వేరియంట్ ప్రధాన ఫీచర్లు:
- డిజిటల్ ఐలాండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్
- మ్యాన్యువల్ హెచ్‌వీఏసీ
- శాటిన్ క్రోమ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్
- 12V పవర్ సాకెట్
ఈ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇతర లగ్జరీ కన్వీనియన్స్ ఫీచర్లు ఉండవు. కస్టమర్లు అవసరమైతే వీటిని బయట లేదా అదనపు యాక్సెసరీస్‌గా ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రక్షణే పరమావధి - భద్రతా ప్రమాణాలు
{{/usCountry}}ఈ వేరియంట్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇతర లగ్జరీ కన్వీనియన్స్ ఫీచర్లు ఉండవు. కస్టమర్లు అవసరమైతే వీటిని బయట లేదా అదనపు యాక్సెసరీస్‌గా ఫిట్ చేయించుకోవాల్సి ఉంటుంది.
రక్షణే పరమావధి - భద్రతా ప్రమాణాలు
{{/usCountry}}ఈ కారులో అత్యంత చెప్పుకోదగ్గ హైలైట్ భద్రత. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బేస్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
దీనితో పాటు మరికొన్ని కీలక సేఫ్టీ ఫీచర్లు:
- ఈబీడీతో కూడిన ఏబీఎస్ (ABS with EBD), కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (CSC)
- వెనుక పార్కింగ్ సెన్సార్లు
- ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ యాంకర్లు
- ప్రయాణికులందరికీ త్రీ-పాయింట్ ఈఎల్ఆర్ (ELR) సీట్ బెల్టులు, సీట్ బెల్ట్ రిమైండర్లు
ఇంజన్, పవర్‌ట్రెయిన్
టాటా టియాగో స్మార్ట్ వేరియంట్‌లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. రన్నింగ్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే మైలేజ్ ప్రియుల కోసం ఈ బేస్ వేరియంట్ సీఎన్‌జీ (CNG) ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది.