...
...
Next Story

NHAI recruitment 2026 : ఎన్‌హెచ్‌ఏఐలో లీగల్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. నెలకు రూ. 60,000 జీతం!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) ఐదు లీగల్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. క్లాట్ పీజీ 2026 స్కోర్ ఆధారంగా ఈ ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 8, 2026 చివరి తేదీ. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 15, 2026, 06:45:25 IST
Advertisement

దేశంలోని నిరుద్యోగ లా గ్రాడ్యుయేట్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్ఏఐ) ఒక చక్కటి అవకాశాన్ని అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐదు యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులను దిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయంలోని భూసేకరణ (ఎల్ఏ) విభాగంలో నియమించనున్నారు.

ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..
ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్​ 2026 అప్డేట్స్..

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క్లాట్ పీజీ 2026 ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్ 2026- ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు..

ఎన్​హెచ్​ఏఐ లీగల్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్​మెంట్ 2026లో భాగంగా మొత్తం ఐదు ఖాళీల్లో నాలుగు అన్ రిజర్వుడ్ కేటగిరీకి, ఒకటి ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఎలాంటి పోస్టులు కేటాయించలేదు. అయితే ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం ఐదు పోస్టుల్లో ఒకటి దివ్యాంగులకు కేటాయిస్తారు. పరిపాలనా అవసరాలను బట్టి ఖాళీల సంఖ్యను పెంచే లేదా తగ్గించే పూర్తి అధికారిక హక్కు అథారిటీకి ఉంటుంది.

ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్ 2026- అర్హతలు, వయసు పరిమితి..

దరఖాస్తు గడువు ముగిసే నాటికి అభ్యర్థురిల వయసు 32 సంవత్సరాల లోపు ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి లా డిగ్రీతో పాటు క్లాట్ పీజీ 2026 స్కోర్ తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుంది.

ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్ 2026- జీతం, కాంట్రాక్ట్ కాలం..

సెప్టెంబర్ 8, 2026 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఉంది. ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్ 2026 రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు ప్రత్యేక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆన్‌లైన్ ద్వారా కాకుండా వేరే ఏ ఇతర మార్గంలో పంపిన దరఖాస్తులను అంగీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఎన్​హెచ్​ఏఐ రిక్రూట్​మెంట్ 2026 నోటిఫికేషన్​కి సంబంధించిన డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe