స్టాక్ మార్కెట్‌లో గురువారం (జనవరి 8) మెటల్ రంగ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 2.5% మేర పతనమై 11,231.15 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ మెటల్ సూచీలోని మొత్తం 15 కంపెనీలు ఎరుపు రంగులోనే (నష్టాల్లో) ట్రేడ్ అవ్వడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
కుప్పకూలిన దిగ్గజ షేర్లు
మెటల్ రంగంలో హిందుస్థాన్ జింక్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఈ షేరు దాదాపు 5% నష్టపోయి ₹599.25 వద్దకు చేరింది. ఇది ఆగస్టు 2024 తర్వాత ఈ కంపెనీ చూసిన అత్యంత కనిష్ట స్థాయి.
- నాల్కో (NALCO): 4.3% పతనం
- హిందుస్థాన్ కాపర్: 4.7% పతనం
- వేదాంత: 3% కంటే ఎక్కువ నష్టం
స్టీల్ కంపెనీలు: జిందాల్ స్టీల్, సెయిల్ (SAIL), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. టాటా స్టీల్ మాత్రం ఇతర మెటల్ షేర్లతో పోలిస్తే స్వల్ప నష్టాలతో బయటపడింది.
ఎందుకు ఈ పతనం? నిపుణుల విశ్లేషణ ఇదీ..
మెటల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలడానికి వెనుక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు కొన్ని కీలక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
1. లాభాల స్వీకరణ (Profit Booking): "మెటల్ స్టాక్స్‌లో కనిపిస్తున్న ఈ తగ్గుదలను కేవలం లాభాల స్వీకరణగానే చూడాలి. గత ఏడాది నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 20% కంటే ఎక్కువ లాభాలను ఇచ్చింది. భారీ పెరుగుదల తర్వాత ఇలాంటి చిన్నపాటి సవరణలు (Corrections) సహజమే" అని ఐఎన్‌వీ అసెట్ పీఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసాని అభిప్రాయపడ్డారు.
2. అధిక వాల్యుయేషన్లు: వాల్యుయేషన్లు విపరీతంగా పెరగడమే ఈ పతనానికి అసలు కారణమని ఎక్వినోమిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకులు జి. చొక్కలింగం విశ్లేషించారు. "చారిత్రక ధోరణిని గమనిస్తే.. మెటల్ షేర్లు 2-3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు తప్పనిసరిగా కరెక్షన్ వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రియల్ మెటల్స్ ఉండాల్సిన దానికంటే రెట్టింపు పీఈ (P/E) రేషియోలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}2. అధిక వాల్యుయేషన్లు: వాల్యుయేషన్లు విపరీతంగా పెరగడమే ఈ పతనానికి అసలు కారణమని ఎక్వినోమిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకులు జి. చొక్కలింగం విశ్లేషించారు. "చారిత్రక ధోరణిని గమనిస్తే.. మెటల్ షేర్లు 2-3 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరినప్పుడు తప్పనిసరిగా కరెక్షన్ వస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రియల్ మెటల్స్ ఉండాల్సిన దానికంటే రెట్టింపు పీఈ (P/E) రేషియోలో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}3. అంతర్జాతీయ సుంకాల భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే కాలంలో రష్యా, చైనా, భారత్‌లపై కొత్త సుంకాలు (Tariffs) విధిస్తారన్న ప్రచారం మార్కెట్‌ను భయపెడుతోంది. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించే బిల్లుకు ట్రంప్ ఆమోదం తెలిపారన్న వార్తలు గ్లోబల్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
4. కమోడిటీ ధరల తగ్గుదల: అంతర్జాతీయంగా రాగి (Copper), నికెల్ ధరలు 2% కంటే ఎక్కువగా పడిపోయాయి. అల్యూమినియం, జింక్ ధరలు కూడా తగ్గముఖం పట్టాయి. లోహాల విక్రయ ధరలు అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉండటంతో, గ్లోబల్ ధరలు తగ్గడం మన దేశీయ కంపెనీల ఆదాయాలపై దెబ్బకొడుతోంది.