ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ సరికొత్త ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. యూరోపియన్ నగరాల్లో సులభంగా డ్రైవ్ చేసేలా నిస్సాన్ ‘పిక్సో’ పేరుతో ఒక కాంపాక్ట్ ఏ-సెగ్మెంట్ ఈవీని మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వాహన దిగ్గజం రెనాల్ట్ భాగస్వామ్యంతో నిస్సాన్ ఈ కారును అభివృద్ధి చేసింది. స్లోవేనియాలోని రెనాల్ట్ 'నోవో మెస్టో' ప్లాంట్‌లో ఇది ఉత్పత్తి కానుండగా, 2027 ప్రథమార్థంలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
రోబో ఫేస్ డిజైన్.. ఆకట్టుకునే రోడ్ ప్రెజెన్స్!

కేవలం పెట్రోల్ కార్లకు ఈవీ బ్యాటరీ అమర్చడం కాకుండా, నిస్సాన్ ఈ పిక్సో కారును పక్కా ఈవీ ప్లాట్‌ఫామ్‌పై, పక్కా ప్రణాళికతో డిజైన్ చేసింది.
బాక్సీ స్టైలింగ్: షార్ట్ ఓవర్‌హాంగ్స్, బాక్సీ షేప్‌తో నగర వీధులకు తగినట్లుగా ఉంటుంది.
లైటింగ్ అండ్ లుక్: పిక్సెల్ స్టైల్ హెడ్‌లైట్స్, ముందు భాగంలో రోబోను తలపించేలా "రోబో ఫేస్" బంపర్ డిజైన్ అలరిస్తాయి.
సైజు వివరాలు: ఈ కారు పొడవు 3,796 ఎంఎం, వెడల్పు 1,790 ఎంఎం కాగా, దీని టర్నింగ్ రేడియస్ కేవలం 9.9 మీటర్లు మాత్రమే. ఇరుకైన సందుల్లో కూడా సులువుగా యూ-టర్న్ తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
రంగులు, వీల్స్: 'వండర్ పర్పుల్', 'గియర్ బ్లూ' వంటి ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగులతో పాటు 18-ఇంచుల పిక్సెల్ అలాయ్ వీల్స్‌ను ఈ నిస్సాన్ పిక్సో ఎలక్ట్రిక్ కారులో ఇచ్చారు.
అధునాతన ఇంటీరియర్.. ప్రీమియం ఫీచర్లు
ఇది చిన్న ఎలక్ట్రిక్ కారే అయినప్పటికీ లోపల నలుగురు పెద్దలు హాయిగా కూర్చునేలా విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను అందించారు.
డిజిటల్ డాష్‌బోర్డ్: 7-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు.
కంట్రోల్స్: వాతావరణ నియంత్రణ (ఏసీ) కోసం డిజిటల్ డిస్ప్లే పైనే ఆధారపడకుండా, భౌతిక బటన్లను నిస్సాన్ కొనసాగించడం గమనార్హం.
{{/usCountry}}కంట్రోల్స్: వాతావరణ నియంత్రణ (ఏసీ) కోసం డిజిటల్ డిస్ప్లే పైనే ఆధారపడకుండా, భౌతిక బటన్లను నిస్సాన్ కొనసాగించడం గమనార్హం.
{{/usCountry}}ఫ్లెక్సిబుల్ సీటింగ్ అండ్ బూట్ స్పేస్: వెనుక సీట్లను అవసరానికి తగినట్లు ముందూ వెనుకకు జరుపుకునే వెసులుబాటు ఉంది. మొత్తం 356 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.
ఈవీ సెగ్మెంట్‌లోనే తొలిసారిగా 'గూగుల్ జెమినీ' ఏఐ!
టెక్నాలజీ విషయంలో నిస్సాన్ పిక్సో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా గూగుల్ జెమినీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌ను ఇందులో చేర్చారు.
16 భాషల సపోర్ట్: నావిగేషన్, వాయిస్ కమాండ్స్ కోసం గూగుల్ జెమినీ ఏఐ 16 విభిన్న భాషలు, యాసలను అర్థం చేసుకుంటుంది.
ఫేస్ ఐడీ : కార్ డ్రైవర్‌ను గుర్తించి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా సీట్, ఇన్ఫోటైన్‌మెంట్ సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే ఫేస్ రీడర్ ఫీచర్ ఇందులో ఉంది.
అడ్వాన్స్డ్ సేఫ్టీ : అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు హాండ్స్-ఫ్రీ పార్కింగ్ వంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు దీని సొంతం.
బ్యాటరీ సామర్థ్యం అండ్ ఛార్జింగ్ వివరాలు..
ఈ కారులో 27.5 kWh ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 82 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
డ్రైవింగ్ రేంజ్: ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్టీపీ ప్రమాణాల ప్రకారం 259 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
ఫాస్ట్ ఛార్జింగ్: 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 28 నిమిషాల్లోనే బ్యాటరీని 15% నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.
వెహికల్-టు-గ్రిడ్ : ఇందులో 11కేడబ్ల్యూ బైడైరెక్షనల్ ఏసీ ఛార్జింగ్‌ను అందించడం వల్ల ఈ కారులోని విద్యుత్‌ను ఇతర పరికరాలకు కూడా వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
యూరోపియన్ మార్కెట్ సాధించే విజయం ఆధారంగా, భవిష్యత్తులో ఈ రకమైన కాంపాక్ట్ ఈవీలను భారత్ వంటి ఆసియా మార్కెట్లకు కూడా విస్తరించే అవకాశాలు లేకపోలేదు.