...
...
Next Story

నోబెల్ శాంతి బహుమతి 2026: నవి పిళ్లైకి దక్కిన అత్యున్నత పురస్కారం

ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు, అంతర్జాతీయ చట్టాల అమలుకు కృషి చేసిన భారత సంతతి న్యాయకోవిదురాలు నవనేతం "నవి" పిళ్లైని 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వరించింది. యుద్ధ నేరాలు, నరమేధాలపై విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేయడంలో ఆమె చూపిన అసమాన చొరవకు గాను ఈ పురస్కారాన్ని లభించింది.

Published on: Oct 9, 2026, 14:43:36 IST
Advertisement

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను మరింత విస్తృతం చేయడంలో నవి పిళ్లై కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ నేర నిరూపణ ట్రిబ్యునల్ (ఐసీటీఆర్) న్యాయమూర్తిగా, అంతర్జాతీయ నేరాల కోర్టు (ఐసీసీ) న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలు అపారమైనవి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా పనిచేసిన ఆమె, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర విచారణ కమిషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం మయాన్మార్‌లో జరిగిన రోహింగ్యా నరమేధం కేసును విచారిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఐసీజే) ఆమె న్యాయమూర్తిగా సేవాలందిస్తున్నారు.

చారిత్రాత్మక తీర్పులతో శాంతి స్థాపన

నోబెల్ శాంతి బహుమతి 2026: నవి పిళ్లైకి దక్కిన అత్యున్నత పురస్కారం (X)
నోబెల్ శాంతి బహుమతి 2026: నవి పిళ్లైకి దక్కిన అత్యున్నత పురస్కారం (X)

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అనేక కేసుల్లో నవి పిళ్లై ఇచ్చిన తీర్పులు, తీసుకున్న చట్టపరమైన చర్యలు యుద్ధాలను, తీవ్ర హింసాత్మక ఘటనలను అడ్డుకోవడానికి తోడ్పడ్డాయని నోబెల్ కమిటీ కొనియాడింది. "అంతర్జాతీయ చట్టాలను, వ్యవస్థలను బలోపేతం చేయడంలో నవి పిళ్లై పాత్ర మరకలేనిది. ఆమె స్వతంత్ర ఆలోచనా ధోరణి, విషయ పరిజ్ఞానం, నిబద్ధత ఆమెను మన కాలపు అత్యంత గౌరవనీయ అంతర్జాతీయ న్యాయకోవిదురాలిగా నిలబెట్టాయి" అని సోషల్ మీడియా వేదికగా కమిటీ కొనియాడింది.

సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు ఆమె తన జీవితాన్ని ధారపోశారు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో పోరాడిన నాటి నుంచి అంతర్జాతీయ వేదికలపై మానవ హక్కుల పరిరక్షణ వరకు ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks