ఆఫర్ అదిరింది! రూ. 2,299 విలువ చేసే CMF Buds 2.. కేవలం రూ. 99కే
ప్రముఖ టెక్ బ్రాండ్ 'నథింగ్' ఇండియాలో తన తొలి ఫిజికల్ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 14న గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా కేవలం రూ. 99లకే సీఎంఎఫ్ బడ్స్ 2 అందించడంతో పాటు ఇతర ప్రాడక్ట్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఆన్‌లైన్ మార్కెట్లో సంచలనం సృష్టించిన 'నథింగ్' బ్రాండ్, ఇప్పుడు భారత్‌లో నేరుగా కస్టమర్లకు చేరువయ్యేందుకు సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఫిబ్రవరి 14, 2026న సంస్థ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను సంస్థ ప్రకటించింది.

కేవలం 99 నిమిషాలు.. రూ. 99 కే సీఎంఎఫ్ బడ్స్!
స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, 'నథింగ్' ఒక పరిమిత కాల ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. సాధారణంగా రూ. 2,299 ధర ఉండే సీఎంఎఫ్ బడ్స్ 2 ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ. 99లకే సొంతం చేసుకోవచ్చు.
అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి:
ఈ ఆఫర్ స్టోర్ ప్రారంభించిన మొదటి 99 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సమయం ముగిసిన వెంటనే ఇయర్‌బడ్స్ ధర మళ్లీ యధావిధిగా రూ. 2,299 అవుతుంది.
మరోవైపు ఈ డీల్ కేవలం బెంగళూరులోని కొత్త స్టోర్‌లో మాత్రమే లభిస్తుంది. ఆన్‌లైన్‌లో ఉండదు.
Artificial Intelligence : 'మీది స్క్రీన్ ముందు కూర్చుని చేసే ఉద్యోగం అయితే.. ఏఐ లాగేసుకుంటుంది!'
ఇంకో విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ కోసం కస్టమర్లు ఉదయం 9 గంటల నుంచే క్యూ లైన్లలో వేచి ఉండాల్సి ఉంటుంది. భారీ రద్దీ ఉండే అవకాశం ఉండటంతో కంపెనీ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.
అంటే ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటలకు బెంగళూరులోని నథింగ్ స్టోర్‌కి వెళ్లిన వారు ఈ ఆఫర్‌ని దక్కించుకునే అవకాశం ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ కొంటే ఆడియో ప్రొడక్ట్స్ ఫ్రీ!
కేవలం రూ. 99కే ఇయర్‌బడ్స్‌ని ఇవ్వడం మాత్రమే కాదు, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారుల కోసం మరిన్ని బంపర్ ఆఫర్లను నథింగ్ సిద్ధం చేసింది.
నథింగ్ ఫోన్ (3): ఈ ఫోన్ కొంటే రూ. 5,999 విలువైన ‘నథింగ్ ఇయర్ (ఎ)’ పూర్తిగా ఉచితం.
నథింగ్ ఫోన్ (3ఏ) అండ్ (3ఏ) ప్రో: ఈ మోడల్స్ కొనుగోలుపై 'సీఎంఎఫ్ బడ్స్ 2' ఉచితంగా లభిస్తాయి.
సీఎంఎఫ్ ఫోన్ (3ఏ) లైట్ అండ్ ఫోన్ 2 ప్రో: వీటితో పాటు కూడా సీఎంఎఫ్ బడ్స్ 2 బండిల్ ఆఫర్‌గా పొందవచ్చు.
అంతేకాకుండా, ఓపెనింగ్ రోజున స్టోర్‌లో ఏ వస్తువు కొన్నా.. అదనంగా 3 నెలల ఎక్స్‌టెండెడ్ వారంటీని కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
Interesting Facts : విమానాలు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?
బెంగళూరులో నథింగ్ స్టోర్ ఎక్కడ ఉంది?
టెక్ ప్రియుల హబ్ అయిన ఇందిరానగర్‌లో ఈ నథింగ్ స్టోర్ కొలువుదీరింది.
చిరునామా: 660/1, 100 ఫీట్ రోడ్, 1వ స్టేజ్, ఇందిరానగర్, బెంగళూరు, కర్ణాటక.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్యాడ్జెట్స్ ప్రేమికులకు ఇది ఒక గొప్ప కానుక అని చెప్పవచ్చు. నథింగ్ ఉత్పత్తులను నేరుగా చూసి, అనుభూతి చెంది కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ స్టోర్ ఒక మంచి డెస్టినేషన్ కానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


