...
...
Next Story

NTA recruitment : ఎన్టీఏలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు- అర్హత, అప్లికేషన్ వివరాలు..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు nta.ac.in వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని, ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Nov 26, 2026, 13:26:54 IST
Advertisement

దేశంలో జేఈఈ మెయిన్స్, నీట్, సీయూఈటీ, యూజీసీ-నెట్ వంటి కీలక జాతీయ ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగావకాశం కల్పిస్తోంది. సంస్థలో ఖాళీగా ఉన్న 15 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో నోటిఫికేషన్ వివరాలను పరిశీలించి, నిర్ణీత పద్ధతిలో దరఖాస్తులు పంపాలి.

విద్యార్హతలు.. ఆఫీస్ అసిస్టెంట్ విధులు ఇవే!

ఎన్టీఏలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు- అర్హత, అప్లికేషన్ వివరాలు (Istock)
ఎన్టీఏలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు- అర్హత, అప్లికేషన్ వివరాలు (Istock)

ఈ ఎన్టీఏ రిక్రూట్​మెంట్​ 2026 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్‌పాయింట్, ఈ-మెయిల్, ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్లపై ప్రాథమిక అవగాహన తప్పనిసరి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్పష్టంగా మాట్లాడటం, రాయడం రావాలి.

ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన విభాగంలో రోజువారీ పరిపాలనా, క్లరికల్ పనుల్లో సహకరించాలి. భౌతిక, ఎలక్ట్రానిక్ ఫైళ్లు, రిజిస్టర్లు, రికార్డులు, పత్రాలను క్రమబద్ధంగా నిర్వహించాలి. అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలను స్కాన్ చేయడం, పంపడం, ట్రాక్ చేయడం, నివేదికలు, లేఖలు సిద్ధం చేయడం వంటివి వీరి ప్రధాన బాధ్యతల్లో ఉంటాయి. డేటా ఎంట్రీ, స్ప్రెడ్‌షీట్లు, డేటాబేస్‌ల అప్‌డేషన్, విభాగాల మధ్య ఫైళ్ల కదలిక రికార్డుల నిర్వహణ కూడా చేపట్టాలి. సమావేశాలు, అపాయింట్‌మెంట్లు, అధికారిక పర్యటనలు, వర్క్‌షాపులు, పరీక్షల ఏర్పాట్లలో సమన్వయం చేయడంతో పాటు ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సందర్శకులను మర్యాదపూర్వకంగా పలకరించి సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలి. అధికారిక పత్రాల గోప్యతను కాపాడుతూ, ఉన్నతాధికారులు అప్పగించే ఇతర కార్యాలయ విధులను నిర్వర్తించాలి.

ఎన్టీఏ రిక్రూట్​మెంట్​ 2025- ఎంపిక విధానం, దరఖాస్తు పంపే పద్ధతి

దరఖాస్తులను recruitment@nta.ac.in అనే ఈ-మెయిల్ చిరునామాకు పంపాలి. ఈ-మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో తప్పనిసరిగా “Application for the post of Office Assistant (OA), NTA” అని స్పష్టంగా రాయాలి. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.

ఎన్టీఏ ఆఫీస్ అసిస్టెంట్ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks