Electric bike : 150+ కి.మీ రేంజ్​తో కొత్త ఎలక్ట్రిక్​ బైక్​- రూ. 99,999కే! ఫీచర్లు అదర్స్..

Long range electric bike : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లోకి ఓబెన్ ఎలక్ట్రిక్ తన సరికొత్త మోడల్ ‘రొర్ ఎవో’ను విడుదల చేసింది. నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ బైక్, అత్యాధునిక సాంకేతికతతో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: May 1, 2026, 05:58:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు ఓబెన్ ఎలక్ట్రిక్ తీపి కబురు అందించింది. తన ఫ్లాగ్‌షిప్ మోడల్ 'రొర్' కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా 'రొర్ ఎవో'ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,24,999 కాగా, మొదటి 10,000 మంది కస్టమర్లకు కేవలం రూ. 99,999 (ఇంట్రడక్టరీ ప్రైస్) కే అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది!. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, మే 30, 2026 నుంచి ఈ ఎలక్ట్రిక్​ బైక్ డెలివరీలు మొదలవుతాయి.

ఓబెన్​ రోర్​ ఎవో ఎలక్ట్రిక్ బైక్..
ఓబెన్​ రోర్​ ఎవో ఎలక్ట్రిక్ బైక్..

ఈ నేపథ్యంలో ఓబెన్​ రోర్​ ఎవో ఎలక్ట్రిక్​ బైక్​ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

అదిరిపోయే డిజైన్ - అడ్వాన్స్‌డ్ ఫీచర్లు..

ఓబెన్ రొర్ ఎవో ఎలక్ట్రిక్​ బైక్ చూడటానికి చాలా షార్ప్‌గా, మజిల్ బాడీతో కనిపిస్తుంది.

లుక్: ఇందులో ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ ఉన్నాయి. బాడీపై వైట్ స్టిచింగ్‌తో కూడిన సింగిల్ పీస్ సీటు దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

కూలింగ్ సిస్టమ్: బ్యాటరీ వేడెక్కకుండా ఉండేందుకు బెల్లీ పాన్​లో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఛానల్స్ ఏర్పాటు చేశారు.

స్టోరేజ్: ట్యాంక్ వద్ద 4 లీటర్లు, సీటు కింద 6 లీటర్లతో మొత్తం 10 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ కోసం రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా ఉన్నాయి.

పవర్ ఫుల్ బ్యాటరీ.. గరిష్ట వేగం..

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో 3.4 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రియల్ వరల్డ్ రేంజ్ (ఐడీసీ రేంజ్ 180 కి.మీ) ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

మోటార్: 9 కేడబ్ల్యూ పీక్ పవర్ ఇచ్చే IPMSM మోటార్‌ను ఇందులో వాడారు. ఇది కేవలం 3 సెకన్లలోనే 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

వేగం: ఈ ఓబెన్​ రోర్​ ఎవో బైక్ గరిష్ట వేగం గంటకు 110 కి.మీ. అయితే ఎకో మోడ్‌లో 60 కి.మీ వేగంతో వెళ్లవచ్చు.

ఛార్జింగ్: ఓబెన్ ప్లగ్ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 90 నిమిషాల్లోనే 80% బ్యాటరీ నిండుతుంది.

సేఫ్టీకి పెద్దపీట.. స్మార్ట్ ఐక్యూ ఏఐ..

సాంకేతిక పరంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఇందులో 8-ఇంచ్ కలర్ టీఎఫ్​టీ డిస్​ప్లే ఉంది. దీని ద్వారా నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ చూసుకోవచ్చు.

"స్మార్ట్ ఐక్యూ ఏఐ మోడ్ రైడర్ అలవాట్లను విశ్లేషించి, బైక్ రేంజ్‌ను 15 శాతం వరకు పెంచుతుంది," అని సంస్థ వెల్లడించింది.

అంతేకాకుండా, ఒకవేళ బైక్ కింద పడిపోతే వెంటనే ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కు అలర్ట్ పంపే 'ఫాల్ అలర్ట్' ఫీచర్ ఇందులో ఉంది. దొంగతనం జరగకుండా రిమోట్ ఇమ్మొబిలైజేషన్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

వారంటీ, హార్డ్‌వేర్..

కస్టమర్ల నమ్మకాన్ని పెంచేలా ఈ ఈ-బైక్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీని అందిస్తున్నారు. ఈ బైక్ 17 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్లు, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. 230 ఎంఎం వాటర్ వేడింగ్ కెపాసిటీ ఉండటం వల్ల వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచినా నిశ్చింతగా ప్రయాణించవచ్చు.

మరి మీరు ఈ ఓబెన్​ రోర్​ ఎవో ఎలక్ట్రిక్​ బైక్​ని కొంటున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More