Vizag Google AI Data Center : విశాఖ ఐటీ చరిత్రలో సరికొత్త అధ్యాయం - గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

Google AI Data Hub Vizag : విశాఖ ఐటీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా హబ్‌(సెంటర్)కు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ శంకుస్థాపన చేశారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. 

Published on: Apr 28, 2026, 10:13:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజం 'గూగుల్' తన భారీ ఏఐ డేటా సెంటర్ (AI Data) నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం తర్లువాడలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

రూ.1.35 లక్షల కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్

గూగుల్ సంస్థ మొత్తం రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో మూడు ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇది కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, 1 గిగావాట్ (GW) కంటే ఎక్కువ సామర్థ్యంతో పని చేసే భారీ గ్రిడ్ నెట్‌వర్క్. 2028 నాటికి ఈ మూడు డేటా సెంటర్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

  • ఈ మెగా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక ప్రాంతాల్లో 601 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది.
  • తర్లువాడలో 266.6 ఎకరాలు (తొలి దశ నిర్మాణం ఇక్కడే ప్రారంభం)
  • అడవివరంలో 160 ఎకరాలు
  • రాంబిల్లి (అనకాపల్లి జిల్లా)లో 174.80 ఎకరాలు కేటాయించారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కేవలం నిర్మాణ దశలోనే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు చెందిన సుమారు 60 వేల మందికి పైగా పని దక్కనుంది.

ఆసియాకే గేట్‌వేగా విశాఖ…

విశాఖ కేవలం డేటా సెంటర్‌గా మాత్రమే కాకుండా, 'సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్'కు ప్రధాన కేంద్రంగా అవతరించబోతోంది. దీనివల్ల గూగుల్ క్లౌడ్ సేవలకు ఆసియా ఖండంలోనే విశాఖపట్నం అతిపెద్ద గేట్‌వేగా మారుతుంది. ఏఐ (కృత్రిమ మేధ) రంగంలో విశాఖ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దూసుకుపోవడానికి ఈ ప్రాజెక్టు పునాది కానుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గూగుల్ సంస్థ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

డేటా సెంటర్ కాదు... ఏఐ మెగా హబ్ - మంత్రి లోకేశ్

ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ….. విశాఖలో గూగుల్ 1.35 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందన్నారు. గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ కాదు… ఇది ఏఐ మెగా హబ్ అని చెప్పారు.

“1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఈ డేటా సెంటర్ రాబోతుంది. 2028కి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కంపెనీ నిర్మాణంలో ఉన్నప్పుడే 25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కంపెనీ ఏర్పాటు పూర్తయ్యాక, గూగుల్ హబ్‌తో పాటు ఇతర అనుబంధ కంపెనీలతో కలిపి డైరెక్ట్ & ఇన్‌డైరెక్ట్ గా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్స్ ఇలా అనేక రంగాల్లో హై క్వాలిటీ జాబ్స్ వస్తాయి” అని మంత్రి లోకేశ్ వివరించారు.

Tarluvada (Andhra Pradesh), Apr 28 (PTI) Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Tuesday laid the foundation for USD 15 billion Google Artificial Intelligence data centre near Visakhapatnam.

The 1 GW capacity data centre will emerge as a major step in India's digital infrastructure growth.

It is expected to be one of the largest AI data centres in the country and will provide advanced AI cloud infrastructure and large-scale data storage capabilities, an official release earlier said.

The facility will be established across 600 acres in Tarluvada, Adavivaram and Rambilli villages, with other private partners, aiming to build a larger multi-gigawatt digital ecosystem in the state.

The state government has outlined a long-term vision to develop a multi-gigawatt digital ecosystem with a total capacity of around 6.5 gigawatts, positioning Andhra Pradesh as a major data hub.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More