AI Edge Eloquent : ఇక టైపింగ్​కి గుడ్​ బై- గూగుల్​ కొత్త యాప్​తో మాట్లాడితే చాలు! ఫీచర్స్​ ఇవే..

Google AI Edge Eloquent app : “మాట్లాడితే దానంతట అదే టైప్​ చేసే యాప్​ ఉంటే బాగుండు” అని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే గూగుల్​ మీకో గుడ్​ న్యూస్​ తీసుకొచ్చింది. మాటలను టెక్ట్స్​ రూపంలో మార్చగలిగే ఏఐ ఎడ్జ్​ ఎఎలోక్వెంట్ యాప్​ని తీసుకొచ్చింది. దీని ఫీచర్లను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 8, 2026, 11:28:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పెద్ద పెద్ద వ్యాసాలు రాయాలన్నా, ఆఫీస్ నోట్స్ సిద్ధం చేయాలన్నా కీబోర్డ్‌పై వేళ్లకు పని చెప్పడం ఇక పాత పద్ధతి! మనం మాట్లాడే గజిబిజి మాటలను సైతం అర్థవంతమైన, స్పష్టమైన టెక్ట్స్​ రూపంలో మార్చేందుకు గూగుల్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే "గూగుల్ ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్" యాప్. ఇది ఎలా పనిచేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్​ నుంచి కొత్త ఏఐ స్పీచ్​ టు టెక్ట్స్​ యాప్- ఫీచర్లు ఇవే.. (Pexels)
గూగుల్​ నుంచి కొత్త ఏఐ స్పీచ్​ టు టెక్ట్స్​ యాప్- ఫీచర్లు ఇవే.. (Pexels)

కృత్రిమ మేధతో మాటలకు మెరుగులు

సాధారణ స్పీచ్-టు-టెక్ట్స్​ యాప్‌లలా కాకుండా, 'ఎలోక్వెంట్' యాప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటుంది. గూగుల్ రూపొందించిన 'గెమ్మా' ఆధారిత మోడల్స్‌తో ఇది పనిచేస్తుంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చే 'ఉమ్', 'అహ్' వంటి అనవసర పదాలను ఇది దానంతటదే తొలగిస్తుంది. వాక్యం మధ్యలో మనం సరిచేసుకున్న తప్పులను గుర్తించి, తుది అవుట్‌పుట్‌ను మాత్రం ఎంతో స్పష్టంగా, తప్పులు లేకుండా ఇస్తుంది.

సర్వర్ అవసరం లేదు.. అంతా మీ ఫోన్లోనే!

ఈ గూగుల్ ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ యాప్‌లోని మరో కీలక ఫీచర్ ఏంటంటే, ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడే దానికి సంబంధించిన ఏఐ మోడల్స్ మీ స్మార్ట్‌ఫోన్​లోకి వచ్చేస్తాయి. దీనివల్ల మీ మాటలు లేదా సమాచారం ఏదీ గూగుల్ సర్వర్లకు వెళ్లదు. అన్నీ మీ ఫోన్స్​లోనే ప్రాసెస్ అవుతాయి కాబట్టి మీ వ్యక్తిగత గోప్యతకు పూర్తి భరోసా ఉంటుంది.

ఎలోక్వెంట్ యాప్‌తో ఏమేం చేయవచ్చు?

కేవలం మాటలను టెక్ట్స్​గా మార్చడమే కాకుండా, ఈ యాప్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి:

టెక్ట్స్​ ఎడిటింగ్: మీరు మాట్లాడిన టెక్ట్స్​ని మరింత ఫార్మల్‌గా మార్చుకోవచ్చు. నిడివిని పెంచడం లేదా తగ్గించడం వంటివి కూడా సులభంగా చేయవచ్చు.

కీ పాయింట్స్: ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని రికార్డ్ చేసినప్పుడు, అందులోని ముఖ్య అంశాలను హైలైట్ చేయమని ఈ యాప్‌ను అడగవచ్చు.

కస్టమ్ డిక్షనరీ: మీరు తరచుగా వాడే ప్రత్యేక పదాల కోసం సొంతంగా ఒక డిక్షనరీని రూపొందించుకోవచ్చు. అవసరమైతే మీ జీమెయిల్ ఖాతా నుంచి కూడా పదాలను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

ఉచితం: ఈ యాప్ వాడకానికి ఎలాంటి పరిమితులు లేవు. ఇది పూర్తిగా ఉచితం, మిడ్​ రేంజ్ ఫోన్స్​లో కూడా సులువుగా పనిచేస్తుంది.

ప్రస్తుతం ఎవరికి అందుబాటులో ఉంది?

ప్రస్తుతానికి ఈ యాప్ కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి ఈ గూగుల్ ఏఐ ఎడ్జ్ ఎలోక్వెంట్ యాప్​ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, భవిష్యత్తులో డెస్క్‌టాప్ వెర్షన్లు, కోడింగ్, ఏఐ ఏజెంట్లకు ప్రాంప్ట్‌లు ఇచ్చేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేసే ఆలోచనలో గూగుల్ ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. గూగుల్ ఎలోక్వెంట్ యాప్ వాడటం వల్ల నా ప్రైవసీకి ముప్పు ఉంటుందా?

లేదు. ఈ యాప్ మెషీన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ మీ ఫోన్స్​లోనే రన్ అవుతాయి. మీ ఆడియో రికార్డింగ్‌లు కానీ, ట్రాన్స్‌క్రిప్షన్ కానీ ఫోన్ దాటి బయటకు వెళ్లవు. కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం క్లౌడ్ వాడాల్సి వచ్చినా, సెట్టింగ్స్‌లో దాన్ని ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంది.

2. ఈ యాప్ తెలుగు మాటలను కూడా టెక్ట్స్​గా మారుస్తుందా?

ప్రస్తుతానికి గూగుల్ ఈ యాప్‌ను ప్రధానంగా ఇంగ్లీష్ భాషా సామర్థ్యాలతో విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతీయ భాషలను జోడించే అవకాశం ఉంది.

3. ఆండ్రాయిడ్ ఫోన్స్​లో ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ రిలీజ్ డేట్ గురించి గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇది కేవలం ఐఫోన్లకు మాత్రమే పరిమితం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More