Free AI Course : ఏఐ, డేటా సైన్స్​- హార్వర్డ్​లో ఫ్రీ ఆన్​లైన్​ కోర్సులు..

Online AI Courses : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్ విభాగాల్లో ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. కెరీర్‌ను ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకునే విద్యార్థులు, నిపుణుల కోసం రూపొందించిన ఈ కోర్సుల వివరాలు మీకోసం..

Published on: Apr 06, 2026 5:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీపై పట్టు సాధించడం అనేది కేవలం ఆసక్తి మాత్రమే కాదు, కెరీర్ ఎదుగుదలకు అనివార్యమైన అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచపు టాప్ యూనివర్సిటీ ‘హార్వర్డ్’.. విద్యార్థులు, నిపుణుల కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో అత్యుత్తమ ఆన్‌లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. మీ వీలును బట్టి నేర్చుకునేలా రూపొందించిన ఈ కోర్సులు టెక్ ప్రపంచంలో అప్​గ్రేడ్​ అవ్వాలనుకునే వారికి ఒక గొప్ప వేదిక.

హార్వర్డ్​ ఫ్రీ ఆన్​లైన్​ కోర్సులు..
హార్వర్డ్​ ఫ్రీ ఆన్​లైన్​ కోర్సులు..

డేటా సైన్స్: మెషిన్ లెర్నింగ్ మోడల్స్

మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాల నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వరకు ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తాయి? 'ఓవర్ ట్రైనింగ్' సమస్యను నివారించేందుకు క్రాస్-వాలిడేషన్ ఎలా చేయాలి? రెగ్యులరైజేషన్ వంటి క్లిష్టమైన అంశాలపై ఇందులో అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా 'రికమెండేషన్ సిస్టమ్స్'ను ఎలా నిర్మించాలో ఈ 8 వారాల కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.

బిజినెస్ కోసం కంప్యూటర్ సైన్స్ (సీఎస్​50)..

వ్యాపార రంగంలో టెక్నాలజీని ఎలా సమర్థవంతంగా వాడుకోవాలో ఈ హార్వర్డ్​ ఫ్రీ కోర్సు నేర్పిస్తుంది. కంప్యూటేషనల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇంటర్నెట్ టెక్నాలజీస్, వెబ్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై ఇందులో శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 30, 2026 వరకు అందుబాటులో ఉండే ఈ కోర్సును నిపుణులు తమ వీలును బట్టి పూర్తి చేయవచ్చు.

టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన..

మీరు టెక్నాలజీలో బిగినర్ అయితే ఈ కోర్సు మీకోసమే. ఇంటర్నెట్ అంటే ఏంటి? మల్టీమీడియా, సెక్యూరిటీ, వెబ్ డెవలప్‌మెంట్ ఎలా పనిచేస్తాయి? వంటి ప్రాథమికాంశాలను చాలా సులభంగా వివరిస్తారు. ఇది 6 వారాల కోర్సు.

పైథాన్‌తో డేటా సైన్స్..

రియల్ వరల్డ్ సమస్యలను పరిష్కరించడంలో పైథాన్ పాత్రను ఈ కోర్సు వివరిస్తుంది. పాండాస్, నంపై, మ్యాట్‌ప్లాట్‌లిబ్, స్కిట్-లెర్న్ వంటి లైబ్రరీలను ఎలా వాడాలో ఈ హార్వర్డ్​ ఫ్రీ కోర్సులో ప్రాక్టికల్‌గా నేర్చుకోవచ్చు. 8 వారాల పాటు సాగే ఈ కోర్సు ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చు.

పైథాన్, జావాస్క్రిప్ట్‌తో వెబ్ ప్రోగ్రామింగ్..

హెచ్​టీఎంఎల్​, సీఎస్ఎస్, గిట్, జావాస్క్రిప్ట్, పైథాన్, డీజాంగో, ఎస్​క్యూఎల్ వంటి టూల్స్‌ను ఉపయోగించి వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది సరైన ఛాయిస్. 12 వారాల పాటు సాగే ఈ కోర్సు కోసం వారానికి 6 నుంచి 9 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది.

స్క్రాచ్‌తో ప్రోగ్రామింగ్ పరిచయం..

ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వారి కోసం ఫంక్షన్స్, ఈవెంట్స్, కండిషన్స్, లూప్స్, వేరియబుల్స్ వంటి కీలక అంశాలను 'స్క్రాచ్' ద్వారా చాలా వినోదాత్మకంగా నేర్పిస్తారు. ఇది కేవలం 3 వారాల స్వల్పకాలిక కోర్సు.

ప్రపంచస్థాయి విద్యను ఉచితంగా పొందే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేటి పోటీ ప్రపంచంలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More