BITS Pilani AI course : ఏఐ యుగంలో వెనకపడిపోకండి- ఈ బిట్స్ పిలానీ కోర్సు మీకోసమే..

BITS Pilani AI course : ఏఐ, మెషిన్​ లెర్నింగ్​లో పీజీ సర్టిఫికేషన్​ కోర్సును బిట్స్​ పిలానీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు అప్లికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. ఈ కోర్సు వివరాలను ఇక్కడ క్లిక్​ చేయండి.

Published on: Mar 04, 2026 5:29 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్​) రంగాల్లో కెరీర్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనుకునే టెక్ నిపుణులకు గుడ్​ న్యూస్​! ప్రముఖ విద్యా సంస్థ బిట్స్ పిలానీ మీకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. 2026 ఏప్రిల్ బ్యాచ్‌కు సంబంధించి 'పీజీ సర్టిఫికేట్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్' కోర్సు ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు బిట్స్​ పిలానీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏఐ యుగంలో వెనకపడిపోకండి- బిట్స్ పిలానీ కోర్సు మీకోసమే..
ఏఐ యుగంలో వెనకపడిపోకండి- బిట్స్ పిలానీ కోర్సు మీకోసమే..

బిట్స్​ పిలానీ ఏఐ కోర్సు- ఎవరికి ఉపయోగం?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలనుకునే సాఫ్ట్‌వేర్ నిపుణుల కోసం ఈ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, అప్లైడ్ ఎంఎల్ సైంటిస్ట్ లేదా ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ వంటి కీలక బాధ్యతల్లోకి మారాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో తోడ్పడుతుంది.

బిట్స్​ పిలానీ ఏఐ కోర్సు వివరాలు..

ఇది 11 నెలల పాటు సాగే ఆన్‌లైన్ లైవ్ కోర్సు. ఉద్యోగులు తమ వృత్తి బాధ్యతలను నిర్వహిస్తూనే దీనిని పూర్తి చేయవచ్చు. ఇందులో మొత్తం ఆరు సబ్జెక్టులతో పాటు ఒక 'క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్' కూడా ఉంటుంది.

కోర్సులో భాగమైన ప్రధాన అంశాలు:

  • కోర్ మెషిన్ లెర్నింగ్
  • డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్స్
  • ఎంఎల్ ఇంజనీరింగ్
  • మూడు ఎలెక్టివ్ సబ్జెక్టులు

ఈ కోర్సు ద్వారా విద్యార్థులు జెన్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్ వంటి అత్యాధునిక అంశాలపై పట్టు సాధిస్తారు. వారానికి 8 నుంచి 10 గంటల క్లాస్‌రూమ్ బోధనతో పాటు ల్యాబ్ సదుపాయం, అసైన్‌మెంట్లు మరియు ప్రాజెక్టులు ఉంటాయి.

ఈ కోర్సు ఫీజు రూ. 2,45,000 గా నిర్ణయించారు.

బిట్స్​ పిలానీ ఏఐ కోర్సు- అర్హతలు ఏంటి?

మ్యాథమెటిక్స్/ కంప్యూటర్ సైన్స్/ స్టాటిస్టిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

లేదా సంబంధిత విభాగాల్లో బీటెక్ లేదా తత్సమాన డిగ్రీ ఉండాలి.

ప్రోగ్రామింగ్, డేటాబేస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌పై ప్రాథమిక అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

బిట్స్​ పిలానీ ఏఐ కోర్సు- దరఖాస్తు చేసుకునే విధానం..

స్టెప్​ 1- ముందుగా బిట్స్​ పిలానీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- అప్లికేషన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోండి.

స్టెప్​ 3- మీ వ్యక్తిగత, విద్యా వివరాలను నమోదు చేయండి.

స్టెప్​ 4- నిర్ణీత దరఖాస్తు రుసుము చెల్లించండి.

స్టెప్​ 5- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి.

మీ దరఖాస్తును అడ్మిషన్ సెల్ పరిశీలించి, రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో ఈ-మెయిల్ లేదా అప్లికేషన్ పోర్టల్ ద్వారా తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.

బిట్స్​ పిలానీ ఏఐ కోర్సు డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

వారికి ఉచితంగా ఇంజనీరింగ్​ విద్య!

మరోవైపు బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ సైన్స్​ (బిట్స్​) పిలానీ కొన్ని రోజుల క్రితం ఒక సంచలన ప్రకటన చేసింది! బిట్​సాట్​ 2026 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 500 మంది ర్యాంకర్లకు ఉచిత విద్యను అందించబోతున్నట్టు వెల్లడించింది.

బిట్​సాట్​ 2026 పరీక్షలో మొదటి 500 ర్యాంకులు సాధించి, 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనం వారు చదివే నాలుగేళ్ల ఫస్ట్-డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి వర్తిస్తుంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.