...
...
Next Story

ODI World Cup : 2027 వరల్డ్ కప్- టీమిండియా పూర్తి షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ వివరాలు..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2027 పురుషుల వన్డే ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్ అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో తొలి పోరు ఆడనుంది. టీమిండియా షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్ వివరాలు..

Published on: Oct 2, 2026, 12:20:07 IST
Advertisement

క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్​పై బిగ్ అప్డేట్. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 57 మ్యాచ్‌ల పాటు సాగే ఈ క్రికెట్ మహాసంగ్రామం వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను అలరించేందుకు విశ్వవిజేతను తేల్చే ఈ పోరు దాదాపు ఒకటిన్నర నెలల పాటు కొనసాగనుంది.

2027 వరల్డ్ కప్​లో టీమిండియా షెడ్యూల్.. (ANI Pic Service)
2027 వరల్డ్ కప్​లో టీమిండియా షెడ్యూల్.. (ANI Pic Service)

ఈ నేపథ్యంలో 2027 వరల్డ్ కప్​లో టీమిండియా షెడ్యూల్, మ్యాచుల టైమింగ్ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో.. ఆ వెంటనే పాకిస్థాన్​తో

టీమిండియా తన వరల్డ్ కప్ వేటను అక్టోబర్ 7న కేప్‌టౌన్‌‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో ప్రారంభించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రతిష్టాత్మక వాండరర్స్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఢీకొట్టనుంది. ఈ దాయాదుల పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఇప్పటినుంచే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

గ్రూప్-ఏలో భారత్.. వినూత్న ఫార్మాట్ వివరాలు

ఈ టోర్నీలో మొత్తం 14 జట్లు పాల్గొంటుండగా, వాటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. భారత్ గ్రూప్-ఏ లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, అఫ్గానిస్థాన్, క్వాలిఫైయర్-ఏ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, క్వాలిఫైయర్-బీ జట్లు పోటీపడనున్నాయి.

ఈసారి వరల్డ్ కప్ ఫార్మాట్ కాస్త భిన్నంగా ఉండనుంది. అక్టోబర్ 2న నమీబియాలో ‘సూపర్ సిరీస్’తో టోర్నీ మొదలవుతుంది. క్వాలిఫై అయిన 14 జట్లలో అత్యల్ప ర్యాంకింగ్ ఉన్న మూడు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడగా, అందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్ స్టేజ్ అర్హత సాధిస్తుంది.

సూపర్ 7స్ లోనూ భారత్-పాక్ పోరు!

ఈ వినూత్న సీడింగ్ ఫార్మాట్ వల్ల భారత్, పాకిస్థాన్ జట్లు సూపర్ 7స్ దశలోనూ మరోసారి ముఖాముఖి తలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరు జట్లు క్వాలిఫై అయితే నవంబర్ 7న కేప్‌టౌన్ వేదికగా రెండోసారి దాయాదుల సమరం జరగనుంది.

2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ ..

(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు)

అక్టోబర్ 7: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (న్యూలాండ్స్, కేప్‌టౌన్)

అక్టోబర్ 10: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్)

అక్టోబర్ 14: భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ (త్వానే)

అక్టోబర్ 17: భారత్ వర్సెస్ క్వాలిఫైయర్-ఏ (బ్లూమ్‌‌ఫోంటెన్)

అక్టోబర్ 24: భారత్ వర్సెస్ జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)

సూపర్ 7స్ దశలో భారత్ షెడ్యూల్ (అంచనా)

అక్టోబర్ 28: ఏ1 వర్సెస్ ఏ2 (భారత్ - ఆస్ట్రేలియా అయ్యే అవకాశం) - త్వానే

అక్టోబర్ 31: బీ2 వర్సెస్ ఏ1 (దక్షిణాఫ్రికా - భారత్) - జోహన్నెస్‌బర్గ్

నవంబర్ 4: ఏ1 వర్సెస్ బీ1 (భారత్ - న్యూజిలాండ్) - పార్ల్

నవంబర్ 7: ఏ1 వర్సెస్ ఏ3 (భారత్ - పాకిస్తాన్) - కేప్‌టౌన్

నవంబర్ 10: ఏ1 వర్సెస్ బీ4 (భారత్ - నిర్ణయించాల్సి ఉంది) - గెబర్హా

నవంబర్ 14: ఏ1 వర్సెస్ బీ3 (భారత్ - ఇంగ్లాండ్) - డర్బన్

నాకౌట్ మ్యాచ్‌లు:

నవంబర్ 17: సెమీఫైనల్ 1 (కేప్‌టౌన్)

నవంబర్ 18: సెమీఫైనల్ 2 (త్వానే)

నవంబర్ 21: ఫైనల్ (వాండరర్స్, జోహన్నెస్‌‌బర్గ్)

భారత లెజెండ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వరల్డ్ కప్. అందుకే భారత క్రికెట్ అభిమానులకు ఈ సమరం మరింత పర్సనల్​కానుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks