పాత వర్సెస్ కొత్త- Mahindra Scorpio N ఫేస్‌లిఫ్ట్‌లో కనిపించే మార్పులు ఇవే..
మహీంద్రా స్కార్పియో-ఎన్ 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2022లో లాంచ్ అయిన మోడల్‌కి లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌కి మధ్య ఉన్న తేడాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
మార్కెట్లో సంచలనం సృష్టించిన మహీంద్రా స్కార్పియో ఎన్కి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇటీవలే లాంచ్ అయ్యింది. నాలుగు సంవత్సరాల క్రితం అరంగేట్రం చేసిన ఈ ఎస్‌యూవీకి ఇప్పుడు సరికొత్త హంగులు అద్దారు. బయటి నుంచి చూసేందుకు అచ్చం అలాగే రగ్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ, క్యాబిన్ లోపలి భాగాన్ని మాత్రం పూర్తిగా మార్చేశారు. సరికొత్త డ్యాష్‌బోర్డ్, పెద్ద స్క్రీన్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో దీనిని మరింత లగ్జరీగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో పాత మోడల్‌తో పోలిస్తే 2026 మహీద్రా స్కార్పియో ఎన్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్, ధరల పరంగా ఏ విధంగా మారిందో ఇక్కడ చూసేద్దాము..

పాత వర్సెస్ ఫేస్‌లిఫ్ట్- మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, లుక్..
స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ బాహ్య రూపంలో మహీంద్రా పెద్దగా మార్పులు చేయలేదు! ఈ బడా ఎస్‌యూవీకి సరికొత్త లుక్ తీసుకురాడానికి కొత్త డిజైన్ గల డ్యూయల్-టోన్ 18-ఇంచ్ అలాయ్ వీల్స్‌ను మాత్రం జతచేశారు. బాక్సీ షేప్, సిక్స్-స్లాటెడ్ గ్రిల్, ఎల్ఈడీ లైట్లు, రూఫ్ రెయిల్స్ అన్నీ పాత మోడల్ మాదిరిగానే కొనసాగుతున్నాయి. మొత్తానికి స్కార్పియో ఎన్ ఎస్‌యూవీకి ఉన్న టఫ్ అండ్ బోల్డ్ రోడ్ ప్రెజెన్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రూపుదిద్దుకుంది.
పాత వర్సెస్ ఫేస్‌లిఫ్ట్- మహీంద్రా స్కార్పియో ఎన్ ఇంటీరియర్..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. పాత 9-ఇంచ్ స్క్రీన్ స్థానంలో సరికొత్త 12.3-ఇంచ్ ఫ్రీస్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. దీనికి తగినట్లుగా సెంటర్ కన్సోల్ డిజైన్‌ను కూడా మార్చేశారు. ఏసీ వెంట్లను స్క్రీన్ కింద హారిజాంటల్‌గా అమర్చగా, బ్లాక్-అండ్-బ్రౌన్ అప్‌హోలిస్ట్రీ క్యాబిన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తోంది.
ఎస్యూవీ ఫీచర్ల జాబితాలో భారీ మార్పులే జరిగాయి. సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్ స్థానంలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించారు. సెమీ-అలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తొలగించి 10.25-ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లేను ఇచ్చారు. ముందు కూర్చునే వారి సౌకర్యం కోసం 65వాట్ టైప్-సీ ఫాస్ట్-చార్జింగ్ పోర్ట్ ఉంది. ఆఫ్‌రోడింగ్ డేటా చూపించేందుకు 'అడ్వెంచర్ స్టాటిస్టిక్స్' మోడ్‌ను కూడా ప్రవేశపెట్టారు. భద్రత కోసం 540-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, బ్లైండ్-వ్యూ మానిటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
పాత వర్సెస్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, గేర్‌బాక్స్..
స్కార్పియో ఎన్ ఎస్యూవీ పర్ఫార్మెన్స్ విషయంలో మహీంద్రా ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న నమ్మకమైన ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగించారు. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 203 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. లోయర్ ట్రిమ్స్‌లో 132 హెచ్‌పీ పవర్ ఇస్తుండగా, హైయర్ ట్రిమ్స్‌లో 175 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు యథావిధిగా ఉన్నాయి. డీజిల్ వెర్షన్లలో కొన్ని ట్రిమ్స్‌లో 4x4 డ్రైవ్ ఆప్షన్ లభిస్తుంది.
కాగా అదనపు ఫీచర్ల కారణంగా ధరలు కొద్దిగా పెరిగాయి. పాత మోడల్‌తో పోలిస్తే మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ. 83,500 వరకు ధర పెరిగింది. దీని ప్రారంభ ధర రూ. 13.69 లక్షల నుంచి మొదలవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


