క్రేజీ ఫీచర్స్​తో OnePlus 15 లాంచ్​- 7300ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా! ధర ఎంతంటే..

వన్​ప్లస్​ నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ లాంచ్​ అయ్యింది. అదే వన్​ప్లస్​ 15! ఇందులో అనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 28, 2025, 06:48:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వన్​ప్లస్ సంస్థ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్​ప్లస్ 15ను తాజాగా చైనాలో విడుదల చేసింది. స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్, భారీ 7300ఎంఏహెచ్​ బ్యాటరీ, 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్​తో ఈ మొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపత్యంలో గ్యాడ్జెట్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వన్​ప్లస్​ 15 ఇదిగో.. (Oneplus)
వన్​ప్లస్​ 15 ఇదిగో.. (Oneplus)

వన్​ప్లస్​ 15- పోటీ ఎవరితో?

స్మార్ట్​పోన్​ మార్కెట్​లో ఈ వన్​ప్లస్ 15.. ఐక్యూ 15, రియల్​మీ జీటీ 8ప్రో, వివో ఎక్స్​300 సిరీస్, ఒప్పో ఫైండ్​ ఎక్స్​9 వంటి ఇతర అగ్రశ్రేణి ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

భారత్‌లో స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్‌తో లాంచ్ అవుతున్న మొట్టమొదటి డివైజ్ వన్​ప్లస్ 15 అని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. దీన్ని బట్టి చూస్తే, ఈ ఫోన్ నవంబర్ మధ్యలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

వన్​ప్లస్​ 15 స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే: ఈ స్మార్ట్​ఫోన్ 6.78-అంగుళాలఎల్​టీపీఓ అమోఎల్​ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 165హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అయితే, ఇది పాత మోడల్‌లో ఉన్న 2కే ప్యానెల్ స్థానంలో 1.5కే రెజల్యూషన్‌కు తగ్గించడం జరిగింది.

ప్రాసెసర్- స్టోరేజ్: ఈ ఫోన్ Adreno 840 జీపీయూతో కూడిన పవర్​ఫుల్​ స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ జెన్​ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 16జీబీ LPDDR5x అల్ట్రా ర్యామ్​, యూఎఫ్​ఎస్​ 4.1 స్టోరేజ్‌కు సపోర్ట్ ఉంది.

బ్యాటరీ- ఛార్జింగ్: వన్​ప్లస్ 15లో 7300ఎంఏహెచ్​ పెద్ద బ్యాటరీని పొందుపరిచారు. ఇది 120డబ్ల్యూ సూపర్​వూక్​ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

రేర్​ కెమెరా: వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపీ Sony IMX906 ప్రైమరీ షూటర్, 3.5ఎక్స్​ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ Samsung JN5 టెలిఫోటో లెన్స్, 50ఎంపీ శాంసంగ్​ ఓవీ50డీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో ఆటోఫోకస్ సపోర్ట్‌తో 32ఎంపీ సోనీ IMX709 సెల్ఫీ షూటర్ ఉంది.

వీడియో సామర్థ్యం: వెనుక కెమెరా గరిష్టంగా 8కే 30ఎఫ్​పీఎస్​ , 4కే 120ఎఫ్​పీఎస్​ వీడియోలను షూట్ చేయగలదు. అయితే ముందు కెమెరా 4కే 60ఎఫ్​పీఎస్​ వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు.

వన్​ప్లస్​ 15 ధరలు..

12జీబీ ర్యామ్​ / 256జీబీ స్టోరేజ్ వేరియంట్-​ 3,999 యువాన్​ (సుమారు రూ. 49,259)

16జీబీ ర్యామ్ / 256జీబీ స్టోరేజ్ వేరియంట్​- 4,299 యువాన్​ (సుమారు రూ. 52,982)

12జీబీ ర్యామ్​ / 512జీబీ స్టోరేజ్ వేరియంట్​- 4,599 యువాన్​ (సుమారు రూ. 56,704)

16జీబీ ర్యామ్​ / 512జీబీ స్టోరేజ్ వేరియంట్​- 4,899 యువాన్​ (సుమారు రూ. 60,427)

16జీబీ ర్యామ్​ / 1టీబీ స్టోరేజ్ (టాప్ ఎండ్)- 5,399 యువన్​ (సుమారు రూ. 66,590)

అయితే, చైనాలో ఉన్న ధరలు భారత్‌లో అమ్ముడయ్యే ధరల కంటే కచ్చితంగా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, గత సంవత్సరం బేస్ వేరియంట్ చైనాలో 4499 యువాన్​ ఉండగా, భారత్‌లో 69,990 తో మొదలైంది!

వన్​ప్లస్​ 15- అందుబాటులో ఉన్న రంగులు

వన్​ప్లస్ 15 మొత్తం మూడు రంగులలో లభిస్తుంది: అబ్సొల్యూట్ బ్లాక్, మిస్టీ పర్పుల్, శాండ్ డ్యూన్.

శాండ్ డ్యూన్ వేరియంట్ కొంచెం తక్కువగా 211 గ్రాముల బరువు ఉంటే, మిగిలిన రెండు వేరియంట్లు 215 గ్రాముల బరువును కలిగి ఉన్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More