ఇండియాలో OnePlus 15R లాంచ్ డేట్ ఫిక్స్- ఫీచర్స్, ధర వివరాలు..
ఇండియాలో వన్‌ప్లస్ 15ఆర్ 5జీ, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 లాంచ్ డేట్‌ని సంస్థ ప్రకటించింది. ఈ రెండు కొత్త పరికరాలు డిసెంబర్ 17, 2025న దేశంలో లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 15ఆర్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వన్‌ప్లస్ సంస్థ తన అఫార్డిబుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన వన్‌ప్లస్ 15ఆర్ 5జీని ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు లాంచ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2తో కలిసి వచ్చే నెలలో దేశంలో అరంగేట్రం చేయనుంది. భారత లాంచ్ తేదీతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఎలా ఉంటుందో కూడా కంపెనీ వెల్లడించింది. ఈ రెండు కొత్త పరికరాలు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉండవచ్చో ఇక్కడ తెలుసుకుందాము..

వన్‌ప్లస్ 15ఆర్ 5జీ- ఇండియా లాంచ్ డేట్
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 భారతదేశంలో డిసెంబర్ 17, 2025న లాంచ్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ చార్‌కోల్ బ్లాక్, మింటీ గ్రీన్ అనే రెండు రంగుల ఆప్షన్లలో టీజ్ చేయబడింది.
టాబ్లెట్ (ప్యాడ్ గో 2) మాత్రం షాడో బ్లాక్, లావెండర్ డ్రిఫ్ట్ రంగు ఆప్షన్లలో వస్తుంది.
అధికారిక లాంచ్ తర్వాత ప్రీ-ఆర్డర్ లేదా సేల్ ప్రారంభమైనప్పుడు ఈ రెండు పరికరాలు అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.
వన్‌ప్లస్ 15ఆర్ మొబైల్‌కు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ66 + ఐపీ68 + ఐపీ69 + ఐపీ69కే వంటి అధిక డ్యూరబుల్ బిల్డ్ రేటింగ్‌లు ఉంటాయని కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇది దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌లో అమర్చిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ: ఫీచర్స్ (అంచనా)
వన్‌ప్లస్ 15ఆర్ 5జీ మొబైల్‌లో 6.83-ఇంచ్ 1.5కే ఎల్‌టీపీఎస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండవచ్చని అంచనా. ఈ డిస్‌ప్లే 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి భారీ 7,800ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుందని, అలాగే 120డబ్ల్యూ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.
ధర విషయానికి వస్తే, వన్‌ప్లస్ 15ఆర్ 5జీ మొబైల్ భారతదేశంలో సుమారు రూ. 45,000 ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 15ఆర్, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 వినియోగదారుల కోసం ఎలాంటి ఫీచర్లను తీసుకొస్తాయో కచ్చితంగా తెలుసుకోవడానికి మనం లాంచ్ వరకు వేచి చూడక తప్పదు!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


