Price hike : కస్టమర్లకు షాకిచ్చిన వన్‌ప్లస్, ఒప్పో! స్మార్ట్‌ఫోన్స్ ధరలు భారీగా పెంపు..
Oneplus price hike : ప్రముఖ మొబైల్ బ్రాండ్లు వన్‌ప్లస్, ఒప్పో తమ వివిధ స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను భారీగా పెంచాయి. కొత్త ధరల పూర్తి జాబితా ఇక్కడ చూడండి..
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది! ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు వన్‌ప్లస్, ఒప్పో తమ వివిధ మోడళ్ల ధరలను ఇండియాలో భారీగా పెంచేశాయి. వేరియంట్లను బట్టి ఈ పెంపు రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు ఉండగా, కొన్ని మోడళ్లపై ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి.

వన్‌ప్లస్ ఫోన్ల కొత్త ధరలు..
వన్‌ప్లస్ తన వివిధ మోడళ్లపై రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు ధరలను సవరించింది.
వన్‌ప్లస్ నార్డ్ 6 (12GB+256GB) ధర ఇప్పుడు రూ. 50,999 నుంచి రూ. 52,999కి చేరింది. అలాగే 8GB+256GB వేరియంట్ ధర రూ. 44,999 నుంచి రూ. 46,999కి పెరిగింది.
నార్డ్ సీఈ 6 (8GB+256GB) ధర రూ. 39,999 నుంచి రూ. 41,999కి పెరిగింది. అలాగే 8GB+128GB వేరియంట్ ధర రూ. 35,999 నుంచి రూ. 37,999కి చేరింది.
నార్డ్ సీఈ 6 లైట్ మోడళ్లపై ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది. దీనిలోని 6GB+128GB వేరియంట్ ధర రూ. 25,999 నుంచి రూ. 3,000 పెరిగి రూ. 28,999కి చేరింది. 8GB+128GB వేరియంట్ ధర కూడా రూ. 3,000 పెరిగి రూ. 27,999 నుంచి రూ. 30,999కి చేరింది.
ఈ సిరీస్‌లోని 8GB+256GB వేరియంట్‌పై వన్‌ప్లస్ అత్యధికంగా రూ. 4,000 ధర పెంచింది. దీనితో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30,999 నుంచి రూ. 34,999కి చేరింది.
వన్‌ప్లస్ తన ఎన్ 6, ఎన్ 6ఎక్స్ మోడళ్ల ధరలను కూడా సవరించింది. ఎన్ 6 (4GB+128GB) ధర రూ. 22,999 నుంచి రూ. 24,999కి, 6GB+128GB వేరియంట్ ధర రూ. 24,999 నుంచి రూ. 26,999కి పెరిగింది.
ఎన్ 6ఎక్స్ మోడల్‌లో 4GB+64GB వేరియంట్ ధర రూ. 18,999 నుంచి రూ. 20,999కి చేరగా, 4GB+128GB వేరియంట్ ధర రూ. 20,999 నుంచి రూ. 22,999కి పెరిగింది.
ఒప్పో ఫోన్ల ధరల పెంపు..
మరోవైపు ఒప్పో కూడా తన పలు స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను మంగళవారం నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఒప్పో రెనో 16 5జీ ధర రూ. 66,999 నుంచి రూ. 71,999కి పెరిగింది. అంటే దీనిపై రూ. 5,000 భారం పడింది. రెనో 16 మరో వేరియంట్ ధర రూ. 59,999 నుంచి రూ. 4,000 పెరిగి రూ. 63,999కి చేరింది.
ఒప్పో రెనో 16సీ 5జీ రెండు వేరియంట్ల ధరలు రూ. 3,000, రూ. 4,000 చొప్పున పెరిగాయి. వీటి ధరలు వరుసగా రూ. 49,999 నుంచి రూ. 52,999కి, రూ. 53,999 నుంచి రూ. 57,999కి చేరాయి.
ఒప్పో ఏ6ఎస్ 5జీ ధర రూ. 24,999 నుంచి రూ. 3,000 పెరిగి రూ. 27,999కి చేరుకుంది.
ఒప్పో ఏ6ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లోని మూడు వేరియంట్ల ధరలు పెరిగాయి. రూ. 18,999 ధర కలిగిన వేరియంట్ రూ. 1,000 పెరిగి రూ. 19,999కి చేరగా, రూ. 21,999, రూ. 24,999 వేరియంట్లు రెండేసి వేలు పెరిగి వరుసగా రూ. 23,999 మరియు రూ. 26,999కి చేరాయి.
మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రముఖ బ్రాండ్లు తమ రిటైల్ ధరలను విభిన్న మోడళ్లు, కాన్ఫిగరేషన్లపై సవరిస్తుండటంతో, సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


