8000ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్!
ఒప్పో కే15 టర్బో ప్రో త్వరలోనే విడుదలకానుంది! ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5, 8000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్‌తో అందుబాటులోకి వస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒప్పో సంస్థ త్వరలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేయనుంది. దాని పేరు. ఒప్పో కే15 టర్బో ప్రో. ఈ కే-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన స్పెసిఫికేషన్లు తాజాగా లీకయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.78 ఇంచ్ డిస్‌ప్లే, త్వరలో రాబోతున్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి.

ఒప్పో కే15 టర్బో ప్రో గేమింగ్ దృష్టితో రూపొందించిన ఫోన్ అవ్వొచ్చు! గత జులైలో చైనాలో, ఆ తర్వాత నెల రోజులకే భారతదేశంలో విడుదలైన ఒప్పో కే13 టర్బో ప్రో కంటే ఇందులో బ్యాటరీ అప్‌గ్రేడ్ గణనీయంగా ఉండే అవకాశం ఉంది.
ఒప్పో కే15 టర్బో ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
వీబోలో డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్‌స్టర్.. ఇంకా విడుదల కాని ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. టిప్‌స్టర్ నేరుగా ఫోన్ పేరు చెప్పనప్పటికీ, ఆ పోస్ట్ కింద వచ్చిన కామెంట్లను బట్టి ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో కే15 టర్బో ప్రో అని తెలుస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
లీకైన వివరాలు ఇవే:
స్క్రీన్: ఒప్పో కే15 టర్బో ప్రోలో 1.5కే రిజల్యూషన్‌తో కూడిన 6.78 ఇంచ్ ఎల్టీపీఎస్ ఫ్లాట్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది.
డిజైన్: రౌండ్ కార్నర్స్‌తో కూడిన కొత్త డిజైన్ ఇందులో ఉండవచ్చని అంచనా.
కూలింగ్: ఈ హ్యాండ్‌సెట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ నిర్మాణాన్ని కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా, ఇందులో యాక్టివ్ కూలింగ్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది.
బ్యాటరీ: ఒప్పో కే15 టర్బో ప్రో బ్యాటరీ సామర్థ్యం 8,000ఎంఏహెచ్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజమైతే, 7,000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన గత మోడల్ ఒప్పో కే13 టర్బో ప్రో కంటే ఇది గణనీయమైన అప్‌గ్రేడ్ అవుతుంది!
ఒప్పో కే13 టర్బో ప్రో వివరాలు (పాత మోడల్)
ఒప్పో కే13 టర్బో ప్రో ఈ ఏడాది ఆగస్టులో భారతదేశంలో విడుదలైన విషయం తెలిసిందే. ఒప్పో కే13 టర్బోతో పాటు వచ్చిన ఈ ప్రో మోడల్, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999/- నుంచి ప్రారంభమైంది.
ప్రాసెసర్: ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీ ఉంది.
డిస్‌ప్లే: 1.5కే రిజల్యూషన్‌తో 6.80 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది.
కెమెరాలు: వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
కూలింగ్ అండ్ ఛార్జింగ్: ఈ మోడల్‌లో యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్స్, 7,000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉన్నాయి. ఇది 80డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు బైపాస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
వాటర్ రెసిస్టెన్స్: ఈ ఫోన్‌కు ఐపీఎక్స్6, ఐపీఎక్స్8, ఐపీఎక్స్9 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


