Maruti Suzuki Brezza : ఈ యాక్ససరీస్​తో మీ మారుతీ సుజుకీ బ్రెజ్జా.. మరింత స్టైలిష్​గా!

Maruti Suzuki Brezza accessories : మీరు మారుతీ సుజుకీ బ్రెజ్జా ఓనరా? లేక మీరు ఈ ఎస్​యూవీని కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. బ్రెజ్జాకి సంబంధించిన జెన్యూన్ యాక్ససరీస్​తో పాటు వాటి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Apr 27, 2026, 10:43:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లోని సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా ఒక తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మార్కెట్​లో ఉన్నప్పటికీ, కొత్త కొత్త మోడళ్ల పోటీని తట్టుకుంటూ బ్రెజ్జా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రాక్టికాలిటీ, మైలేజీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారును సామాన్యుడి ఫేవరెట్ ఎస్‌యూవీగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా బ్రెజ్జా ఓనర్​ అయితే, ఈ జెన్యూన్​ యాక్ససరీస్​ని యాడ్​ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఉపయోగకరంగా ఉంటాయి.

మారుతీ సుజుకీ బ్రెజ్జా..
మారుతీ సుజుకీ బ్రెజ్జా..

బ్రెజ్జా సక్సెస్ వెనుక అసలు కారణాలు..

పోటీదారులు ఎన్ని ఫీచర్లు తెచ్చినా, బ్రెజ్జా అమ్మకాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం దాని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది అటు పవర్, ఇటు మైలేజీ మధ్య సరైన సమతుల్యతను పాటిస్తుంది.

ధర: బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 13.01 లక్షల మధ్య ఉంటుంది.

మైలేజీ: పెట్రోల్ వెర్షన్ లీటరుకు 17.38 నుంచి 19.89 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా, సీఎన్జీ వెర్షన్ కిలోకు 25.51 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తోంది.

ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ అందుబాటులో ఉన్నాయి.

మీ బ్రెజ్జాను మరింత స్పెషల్‌గా మార్చుకోండి!

మీరు ఇప్పటికే బ్రెజ్జా ఎస్​యూవీ యజమాని అయినా లేదా కొత్తగా కొనే ప్లాన్‌లో ఉన్నా, మీ కారు లుక్‌ను మరింత పెంచేందుకు మారుతీ సుజుకీ 'జెన్యూన్ యాక్సెసరీస్' పేరుతో కొన్ని ప్రత్యేక పరికరాలను అందిస్తోంది. కేవలం బయటి అందమే కాదు, కారు లోపల సౌకర్యాన్ని పెంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

మారుతీ సుజుకీ బ్రెజ్జా కోసం ఈ యాక్ససరీస్..
ఎక్స్​టీరియర్​ యాక్ససరీస్ధర (రూ.)ఇంటీరియర్​ యాక్ససరీస్ధర (రూ.)సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్ధర (రూ.)
అలాయ్ వీల్స్8,508 - 9,449సీట్​ కవర్8,190 - 9,690కార్​ రివర్స్​ కెమెరా5,190 - 5,390
వీల్​ కవర్460 - 553డోర్​ సిల్​ గార్డ్1,945 - 3,032డిజిటల్​ వీడియో రికార్డ్4,990
ఫ్రెంట్​ స్కిడ్​ ప్లేట్1,281ఫ్లోర్​ మ్యాట్1,253 - 5,042రేర్​ కెమెరా4,550
రేర్​ స్కిడ్​ ప్లేట్1,521ఆర్మ్​రెస్ట్​ యాక్ససరీ కిట్2,756ఫ్రెంట్​ పార్కింగ్ సెన్సార్5,490
సైడ్​ స్కిడ్​ ప్లేట్2,894ఇంటీరియర్​ స్టైలింగ్ కిట్5,522 - 9,209ఫాగ్ ల్యాంప్5,798
ఫ్రెంట్​ బంపర్​ ఎక్స్​టెండర్1,373ట్రంక్​ సిల్​ గార్డ్2,479బాడీ కవర్1,359 - 2,834
రేర్​ బంపర్​ ఎక్స్​టెండర్1,373స్టీరియో సిస్టెమ్5,990 - 21,990
ఫ్రెంట్​ ఎక్స్​టెండర్460క్యాబిన్​ ఎయిర్​ ఫిల్టర్625 - 940
రేర్​ స్పాయిలర్​ ఎక్స్​టెన్షన్460స్పీకర్2,390 - 4,690
బాడీ సైడ్​ మౌల్డింగ్1,742 - 2,479రేర్​ పార్సిల్​ ట్రే1,451
సైడ్​ క్లాడింగ్2,203స్పీకర్ స్పేసర్​ సెట్183 - 437
రేర్​ అప్పర్​ స్పాయిలర్820బూట్​ మ్యాట్1,373 - 1,557
డోర్​ విజర్ 1,557 - 2,258విండో సన్​షేడ్1,359
వీల్​ ఆర్చ్​ కిట్1,834 - 2,203రేర్​ విండో సన్​షేడ్657
వీల్​ ఆర్చ్​ క్లాడింగ్5,982స్టీరింగ్​ వీల్​ కవర్253 - 885
వీల్​ ఆర్చ్ గార్నిష్543
సైడ్​ స్టెప్11,975
నెంబర్​ ప్లేట్​ ఫ్రేమ్499
ఫాగ్​ ల్యాంప్​ గార్నిష్599
ఫ్రెంట్​ గ్రిల్​ గార్నిష్451 - 1,281
రేర్​ మిడ్ గార్నిష్636
బ్యాక్​ డోర్ గార్నిష్728
ఫెండర్​ గార్నిష్267
రేర్​ ప్రొటెక్టర్​ ఎక్స్​టెండర్3,032
ఓఆర్​వీఎం, ఐఆర్​వీఎం కవర్3,309
రేర్​ లోయర్​ బంపర్​ గార్నిష్530
బంపర్​ కార్నర్​ ప్రొటెక్షన్1,373 - 1,557
మడ్​ ఫ్లాప్728
విండో ఫ్రేమ్ కిట్2,018
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More