తెలుగు చలనచిత్ర రంగాన పవర్ స్టార్‌గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువుదీరిన పవన్ కళ్యాణ్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన కొత్త సినిమా విశేషాలు లేదా రాజకీయ వేదికలపై సంచలన ప్రసంగాల కోసం కాదు; తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయంతో వార్తల్లోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవా (అన్నా కొణిదెల) నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధం ముగిసిందంటూ ఇరువురూ కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

పవన్ కళ్యాణ్‌కు అన్నా లెజ్నెవా మూడో భార్య అన్న విషయం తెలిసిందే.
ఉమ్మడి ప్రకటనలో ఏముంది?
తమ బంధం ముగింపుపై పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
"మా జీవితాల్లో ఒక ముఖ్యమైన కాలాన్ని కలిసి పంచుకున్న తర్వాత, పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. భార్యాభర్తలుగా మా బంధం ముగిసినప్పటికీ, మంచి స్నేహితులుగా, మా పిల్లలకు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతాం. పిల్లల సంతోషం, శ్రేయస్సే ఎల్లప్పుడూ మా ప్రథమ ప్రాధాన్యం," అని పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కష్ట సమయంలో తమ వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని, గోప్యతను కాపాడాలని ప్రజలను, అభిమానులను కోరారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎవరు ఈ అన్నా లెజ్నెవా?
పలు మీడియా కథనాల ప్రకారం.. రష్యాకు చెందిన అన్నా లెజ్నెవా 1980లో జన్మించారు. ఆమె మోడలింగ్, నటన రంగాల్లో పనిచేశారు. 2011లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన 'తీన్ మార్' సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అన్నా లెజ్నెవాతో పరిచయం ఏర్పడింది. ఆ చిత్రంలో ఆమె చిన్న పాత్ర పోషించారు. కొన్నాళ్ల పరిచయం తర్వాత 2013 సెప్టెంబరులో ప్రత్యేక వివాహ చట్టం కింద హైదరాబాద్‌లోని సబ్‌రజిస్ట్రార్ కార్యాలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
వీరికి 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు జన్మించాడు. అన్నా లెజ్నెవాకు పూర్వ వివాహం ద్వారా పోలెనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉండగా, పవన్ కళ్యాణ్ ఆ పాపను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు.
అన్నా లెజ్నెవా నెట్ వర్త్..
{{/usCountry}}వీరికి 2017లో మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు జన్మించాడు. అన్నా లెజ్నెవాకు పూర్వ వివాహం ద్వారా పోలెనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉండగా, పవన్ కళ్యాణ్ ఆ పాపను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారు.
అన్నా లెజ్నెవా నెట్ వర్త్..
{{/usCountry}}అన్నా లెజ్నావా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. అనంతరం ఆమె హోటల్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు. సింగపూర్, రష్యాల్లో ఆమెకు సొంత హోటళ్లు, ఆస్తులు ఉన్నాయి.
మీడియా నివేదికల ప్రకారం అన్నా లెజ్నెవా ఆస్తుల విలువ దాదాపు రూ. 1,800 కోట్లు ఉంటుందని అంచనా!
వివాహ బంధాలు - గత నేపథ్యం
గత కొంతకాలంగా కొణిదెల కుటుంబ వేడుకల్లో అన్నా లెజ్నెవా ఎక్కువగా కనిపించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు షికారు చేశాయి. అయితే ఎన్నికల విజయం, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వంటి కీలక ఘట్టాల్లో ఆమె పవన్ పక్కనే కనిపించారు.
పవన్ కళ్యాణ్ వివాహ బంధాలు..
1997 సెప్టెంబరులో ఆయన నందినిని మొదటి వివాహం చేసుకోగా, 1999లో వారు విడిపోయారు. 2008లో వీరికి చట్టబద్ధంగా విడాకులు లభించాయి.
ఆ తర్వాత నటి రేణు దేశాయ్‌ని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్, రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు.
2013లో అన్నా లెజ్నెవాను మూడో వివాహం చేసుకున్న పవన్, 13 ఏళ్ల బంధం తర్వాత ఇప్పుడు ఆమెతోనూ సమ్మతితో విడిపోతున్నట్లు వెల్లడించారు.