...
...
Next Story

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ 5 కీలక అంశాలు తప్పక తెలుసుకోండి..

పర్సనల్ లోన్ తీసుకునే ముందు పరిగణించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో 5 అంశాలు చాలా కీలకమైనవి. అవి తెలిస్తే, మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీ మీద అప్పుల భారం తగ్గుతుంది. అవేంటంటే..

Published on: Nov 05, 2025 11:00 AM IST
Advertisement

కొవిడ్​ తర్వాత, సగటు భారతీయ కుటుంబ అప్పు (హౌస్​హోల్డ్​ డెట్​) వృద్ధి రేటు.. వారి ఆర్థిక ఆస్తుల వృద్ధి రేటు కంటే వేగంగా పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం.. 2019-2025 మధ్యకాలంలో సగటు ఆస్తులు 48 శాతం పెరిగితే, అప్పులు ఏకంగా 102% వృద్ధిచెందాయి!

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా పర్సనల్​ లోన్​ వంటి అధిక భారంతో కూడిన అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. చాలా అవసరం.

మీరు రుణం తీసుకోవాలని నిర్ణయించుకునే ముందు తప్పనిసరిగా చెక్​ చేయాల్సిన కీలక అంశాలను ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి..

I. అది తప్పనిసరి అవసరమా?

ముందుగా, మీరు తీసుకునే పర్సనల్​ లోన్​ నిజంగా అత్యవసరమా, కాదా అనేది చూడాలి. రుణం తీసుకోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ వాయిదా వేయడానికి లేదా రద్దు చేయడానికి వీలులేని కారణాలు మాత్రమే తప్పనిసరి అవుతాయి! ఉదాహరణకు.. ఇంటి కోసం తీసుకునే రుణం ఒక రకంగా తప్పనిసరిగా పరిగణించవచ్చు. కానీ, విహారయాత్రలకు, లేదా విలాసవంతమైన వస్తువులు కొనడానికి తీసుకునే రుణం అత్యవసరం కాదు.

II. ఇల్లు వర్సెస్​ ఇతర అవసరాలు

వివిధ రకాల రుణాల మధ్య తేడాను గుర్తించడానికి మరొక సులభమైన మార్గం ఏమిటంటే.. హోమ్​ లోన్​ చాలా ముఖ్యమైనదిగా భావించడం. మిగిలిన అన్నింటికీ తీసుకునే రుణం సమానంగా ముఖ్యమైనది కాకపోవచ్చు!

అయితే విద్య, కారు లేదా అత్యవసర పరిస్థితుల వంటి ఇతర ముఖ్యమైన కారణాల కోసం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ అవసరాలకు కేటాయించిన రుణ మొత్తం మీ మొత్తం అవసరాన్ని తీర్చలేకపోతే, అప్పుడు మీరు పర్సనల్​ లోన్​ తీసుకోవచ్చు అనే విషయం గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ముఖ్యమైన మరో అంశం రుణం మొత్తం! ఉదాహరణకు, మీకు రూ. 2 లక్షలు అవసరమైతే, మీరు రూ. 2.5 లక్షలు తీసుకోవద్దు. అదనపు వడ్డీతో కలిపి, ఇది ఆ అదనపు రూ. 50 వేల కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది.

మరోవైపు బ్యాంక్​ నుంచి డబ్బు పొందగలుగుతున్నామనే కారణంతో ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవడం కూడా మానుకోవాలి.

ఉదాహరణకు, మీరు రూ. 5 లక్షల విలువైన కారును కొనుగోలు చేయగలిగితే, రూ. 10 లక్షలకు రుణం దొరుకుతుందనే కారణంగా ఆ మొత్తాన్ని తీసుకుని ఖర్చు చేయకూడదు.

IV. వడ్డీ రేట్ల సరైన పోలిక

మీరు రుణం తీసుకునే ముందు, వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను తప్పకుండా పోల్చి చూడండి. ఇది మీ అప్పుల భారాన్ని తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది.

V. ఎఫ్​డీ/మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం

వీటితో పాటు మీరు ఫిక్స్​డ్​ డిపాజిట్ (ఎఫ్​డీ) లేదా మ్యూచువల్ ఫండ్‌లపై కూడా రుణం తీసుకోవచ్చు. ఈ రుణాలు వ్యక్తిగత రుణం కంటే చాలా చౌకగా లభిస్తాయి. ఎందుకంటే, వ్యక్తిగత రుణం అన్‌సెక్యూర్డ్ (ఎటువంటి తాకట్టు లేనిది) కాబట్టి, దానిపై అధిక వడ్డీ రేటు వసూలు చేస్తారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe