అలర్ట్​! ఈ నవంబర్​లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే..

నవంబర్​ బ్యాంకు సెలవులకు సంబంధించిన లిస్ట్​ బయటకు వచ్చింది. ఈ నెలలో బ్యాంకులకు 5 ప్రత్యేక సెలవులతో పాటు వారాంత సెలవులు లభిస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 1, 2025, 09:15:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారికి అలర్ట్​! నవంబర్​లో బ్యాంకులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి ఆదివారం, రెండ- నాల్గొవ శనివారాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మీరు మీ బ్యాంకు కార్యకలాపాలను చూసుకునేందుకు వీలుగా, ఈ నవంబర్​లో బ్యాంకు సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నవంబర్​లో బ్యాంకు సెలవుల లిస్ట్​..
నవంబర్​లో బ్యాంకు సెలవుల లిస్ట్​..

నవంబర్​ 2025లో బ్యాంకు సెలవులు..

నవంబర్ 1: కన్నడ రజతోత్సవ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 1956లో కన్నడ మాట్లాడే ప్రాంతాలు విలీనమై కర్ణాటక రాష్ట్రం ఏర్పడిన రోజును పురస్కరించుకుని ఈ రోజున రాష్ట్రం మొత్తం కన్నడ రాజ్యోత్సవ వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా, డెహ్రాడూన్ ప్రాంతంలో ఇగాస్-బగ్వాల్ లేదా బుద్ధి దీపావళి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

నవంబర్ 5: ఈ రోజున దేశంలోని అనేక ప్రాంతాల్లో గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ వంటి పండుగలను జరుపుకుంటారు. ఈ జాబితాలో హైదరాబాద్ కూడా ఉండటం వల్ల, తెలుగు రాష్ట్రాల్లోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) బ్యాంకుల ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించగలరు.

నవంబర్ 6, 7: షిల్లాంగ్‌లో వరుసగా ఖాసీ తెగకు చెందిన ఐదు రోజుల సాంప్రదాయ పండుగ అయిన నోంగ్‌క్రెమ్ నృత్యోత్సవం, సూర్య భగవానుడికి (సల్‌జాంగ్) బలులు అర్పించే గారో తెగ పండుగ అయిన వాంగాలా ఫెస్టివల్ సందర్భంగా సెలవులు ప్రకటించారు.

నవంబర్ 8: కవి, సంఘ సంస్కర్త అయిన శ్రీ కనకదాస జయంతి సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. రెండో శనివారం కావడంతో ఇతర బ్యాంకులకు కూడా సెలవే!

వీటితో పాటు నవంబర్​ 2, 9, 16, 22, 23 తేదీల్లో కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.

బ్యాంక్ సెలవు రోజుల్లో ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి?

బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, కస్టమర్‌లు తమ లావాదేవీల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆన్‌లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలను నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల నోటిఫై చేస్తే తప్ప, డిజిటల్ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

అత్యవసర నగదు కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.

యూపీఐ, మీ బ్యాంక్ యాప్‌ల ద్వారా చెల్లింపులను సులభంగా పూర్తి చేయవచ్చు.

బ్యాంకు శాఖల కార్యకలాపాలపై సెలవులు తాత్కాలికంగా ప్రభావం చూపినా, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా మీ లావాదేవీలు సజావుగా జరుగుతాయని గమనించగలరు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More