Petrol Diesel price : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు- 8 రోజుల్లో 3వసారి!
Petrol price Hyderabad : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 91 పైసలు పెరిగాయి. ఇంధన ధరలు పెరగడం 8 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం!
Petrol Diesel price increased : అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 91పైసలు పెంచినట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. 8 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోవసారి.

మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు (మే 23 నాటికి)..
దిల్లీ: పెట్రోల్ లీటరు ధర రూ. 99.51 కి చేరగా.. డీజిల్ ధర రూ. 92.49 గా ఉంది.
ముంబై: ఇక్కడ ఇంధన ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగా ఉంటాయి. పెట్రోల్ లీటరు రూ. 107.59, డీజిల్ రూ. 94.08 వద్ద విక్రయించబడుతోంది.
చెన్నై: పెట్రోల్ ధర లీటరు రూ. 104.51, డీజిల్ ధర రూ. 96.21 గా ఉంది.
కోల్‌కతా: పెట్రోల్ లీటరు రూ. 109.66 కు పెరగ్గా, డీజిల్ ధర రూ. 96.07 వద్ద ఉంది.
హైదరాబాద్ : ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 112.81గాను, లీటరు డీజిల్ ధర రూ. 100.94గా ఉంది.
విజయవాడ : ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 114.72గాను, లీటరు డీజిల్ ధర రూ. 102.43గాను ఉన్నాయి.
8 రోజుల్లోనేే రూ. 5 పెరిగిన ధరలు..
చమురు సంస్థలు గత ఎనిమిది రోజుల్లోనే లీటరుపై దాదాపు రూ. 5 మేర భారాన్ని మోపాయి! మొదటగా మే 15న లీటరుకు రూ. 3 పెంచగా, ఆ తర్వాత మే 19న మరో 90 పైసలు పెంచాయి. ఇప్పుడు శనివారం (మే 23) చేసిన సవరణతో కలిపి మొత్తంగా వారంలోనే రూ. 5 వరకు ధరలు పెరిగాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఇరాన్ కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ జలమార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి.
రూపాయి క్షీణత: భారతదేశం తన ముడిచమురు అవసరాలలో 88% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ దాదాపు 6% క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 95.6 వద్ద కొనసాగుతోంది.
నష్టాల్లోనే చమురు సంస్థలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల రోజుకు దాదాపు రూ. 1,000 కోట్ల రెవెన్యూ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పేర్కొన్నాయి. తాజా పెంపుతో కొంత ఒత్తిడి తగ్గినప్పటికీ.. రిటైల్ విక్రయాలపై ఇప్పటికీ లీటరుకు రూ. 9 నుంచి రూ. 12 వరకు నష్టాలు వస్తున్నట్లు ఇంధన రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలతో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం వాడే ఇంధన ధరలు రూ. 5 పెరగడం అంటేనే జేబుకు భారీగా చిల్లుపడినట్టు లెక్క! అలాంటిది రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకెంత పెరుగుతాయో అని నిత్యం భయంభయంగా బతుకుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


