ఫిజిక్స్​వాలా ఐపీఓకి బంపర్​ లిస్టింగ్​- 30శాతం కన్నా అధిక లాభాలు.. కొనాలా? అమ్మేయాలా?

స్టాక్​ మార్కెట్​లో ఫిజిక్స్​వాలా ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభించింది! ఈ సంస్థ షేర్లు 30శాతం కన్నా ఎక్కువ ప్రీమియంతో మంగళవారం లిస్ట్​ అయ్యాయి. మరి ఫిజిక్స్​వాలా షేర్లను ఇప్పుడు కొనాలా? అమ్మేయాలా?

Published on: Nov 18, 2025 9:55 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎడ్​టెక్​ రంగంలో లీడింగ్​ సంస్థ ఫిజిక్స్​వాలా ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ లభించింది! మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ ఐపీఓ షేర్లు భారీ లాభాలతో లిస్ట్​ అయ్యాయి. అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 109తో పోల్చితే ఫిజిక్స్​ వాలా షేర్లు బీఎస్​ఈలో రూ. 145 వద్ద 33శాతం లాభాలతో లిస్ట్​ అయ్యాయి. అదే సమయంలో ఎన్​ఎస్​ఈలో రూ. 143.10 వద్ద 31.28శాతంతో ఓపెన్​ అయ్యాయి.

ఫిజిక్స్​వాలా కోఫౌండర్​ అలఖ్​ పాండే..
ఫిజిక్స్​వాలా కోఫౌండర్​ అలఖ్​ పాండే..

ఫిజిక్స్​వాలా షేరు- కొనాలా? అమ్మేయాలా?

అనేక మంది స్టాక్​ మార్కెట్​ నిపుణలు.. ఈ ఫిజిక్స్​వాలా షేర్లను లాంగ్​ టర్మ్​ వ్యూతో చూస్తున్నారు. ఇది షార్ట్​-టర్మ్​ రిటర్నుల కోసం కాదని చెబుతున్నారు.

“”భారత ఎడ్​టెక్​ రంగంలో ఫిజిక్స్​వాలా ఐపీఓ ఒక కీలక ఘట్టం! ఇది వ్యవస్థల స్థాయిలో డిజిటల వైరాలిటీకి చిహ్నం. ఈ కంపెనీ ఆదాయం ఎఫ్​వై23లోని రూ. 772 కోట్ల నుంచి ఎఫ్​వై25లో రూ. 3వేల కోట్లకు చేరింది. అంటే ఇందులో టాప్​లైమ్​ మూమెంటమ్​, బ్రాండ్​ వాల్యూ బలంగా ఉన్నట్టు. కానీ లాభాలు మాత్రం ఇప్పట్లో కనిపించేలా లేవు! నెగిటివ్​ ఆదాయంతో పాటు అధిక వాల్యూయేషన్​ కారణంగా ఈ ఐపీఓని షార్ట్​ టర్మ్​ రిటర్నులుగా కాకుండా, లాంగ్​ టర్మ్​ ఇన్వెస్ట్​మెంట్​ కోసం చూడాలి," అని ఐఎన్​వీఅసెట్​ పీఎంఎస్​ బిజినెస్​ హెడ్​ భవిక్​ జోషి తెలిపారు.

“దేశంలో విద్యను మార్చుతున్నాము”

“ఐపీఓగా రావడం మంచి ఆర్థిక మైలురాయి. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గతంలో పిల్లలు విద్య కోసం చాలా ఖర్చు చేయాల్సి వచ్చేది. భారతీయులను ఎడ్యుకేట్​ చేసే మిషన్​లో ఉన్నాము. దేశంలో విద్యా విధానాన్ని మార్చేందుకు ఫిజిక్స్​వాలా కృషి చేస్తోంది,” అని ఎడ్​టెక్​ సంస్థ కోఫౌండర్​ అలఖ్​ పాండే తెలిపారు.

ఫిజిక్స్​వాలా ఐపీఓ వివరాలు..

పీఓ ముఖ్య తేదీలు, లిస్టింగ్ వివరాలు-

  • ఫిజిక్స్​వాలా ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ప్రారంభం- నవంబర్ 11
  • ఐపీఓ ముగింపు- నవంబర్ 13
  • అలాట్‌మెంట్ తేదీ- నవంబర్ 14
  • ఫిజిక్స్​వాలా ఐపీఓ లిస్టింగ్ తేదీ- నవంబర్ 18

ఐపీఓ ధర- నిధుల సమీకరణ..

ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​: ఈ ఐపీఓకు ధరల పట్టీ ఒక్కో షేరుకు రూ. 103 నుంచి రూ. 109గా నిర్ణయించారు.

నిధుల సమీకరణ: బుక్-బిల్డ్ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 3,480.71 కోట్లు సేకరించింది.

ఈ ఇష్యూలో రూ. 3,100.71 కోట్ల విలువైన 28.45 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ కాగా రూ. 380 కోట్ల విలువైన 3.49 కోట్ల షేర్ల ఆఫర్-ఫర్-సేల్​గా ఉన్నాయి.

సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ వివరాలు..

ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం.. ఫిజిక్స్‌వాలా ఐపీఓ మొత్తం 1.81 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. వివిధ విభాగాలలో సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇలా ఉన్నాయి:

రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ విభాగంలో: 1.06 రెట్లు బుక్ అయ్యింది.

నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో: 48% సబ్‌స్క్రైబ్ అయ్యింది.

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో: అత్యధికంగా 2.70 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది.

ఈ ఐపీఓకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కో. లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది. ఎంయూఎఫ్​జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్‌గా ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)