Sign in

అమెరికా సూచీలు క్రాష్​- ఈ రోజు దేశీయ స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ బెస్ట్​?

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 14, 2025, 08:15:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 12 పాయింట్లు పెరిగి 84,479 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 3 పాయింట్లు వృద్ధిచెంది 25,879 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 58,382 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 383.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,091.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ ​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 8,684.44 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 32,890.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 110 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 26000 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 26,200- 26,350 వరకు ర్యాలీ అవ్వొచ్చు. 25,800 వద్ద సపోర్ట్​ ఉంది. దాని కన్నా దిగువకు పడితే ర్యాలీ కోల్పోయినట్టు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. ప్రాఫిట్​ బుకింగ్​ ఇందుకు కారణం. డౌ జోన్స్​ 1.65 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 1.66శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.29 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఆవాస్​ ఫైనాన్షియర్స్​- బై రూ. 1736, స్టాప్​ లాస్​ రూ. 1675, టార్గెట్​ రూ. 1858

వేదాంత- బై రూ. 530, స్టాప్​ లాస్​ రూ. 511, టార్గెట్​ రూ. 568

ఎన్​టీపీసీ- బై రూ. 326, స్టాప్​ లాస్​ రూ. 316, టార్గెట్​ రూ. 342

బీఈఎల్​- బై రూ. 419, స్టాప్​ లాస్​ రూ. 408, టార్గెట్​ రూ. 435

మారుతీ సుజుకీ- బై రూ. 16750, స్టాప్​ లాస్​ రూ. 16400, టార్గెట్​ రూ. 17,100

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

గోకుల్ ఆగ్రో రిసోర్సెస్: రూ .200 వద్ద కొనండి, రూ .215 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .193;

గోల్డియం ఇంటర్నేషనల్: రూ .390 వద్ద కొనండి, లక్ష్యం రూ .420, స్టాప్ లాస్ రూ .376;

అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్: రూ .285 వద్ద కొనండి, టార్గెట్ రూ .305, స్టాప్ లాస్ రూ .276;

కరారో ఇండియా: రూ .531 వద్ద కొనండి, టార్గెట్ రూ .570, స్టాప్ లాస్ రూ .515;

డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ .524 వద్ద కొనండి, రూ .560 టార్గెట్ చేయండి, స్టాప్ లాస్ రూ .505.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More