...
...
Next Story

Electric scooter : 161 కి.మీ రేంజ్​తో ఏథర్​ కోనార్క్- ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ ఈఎంఐ ఎంతంటే..

ఏథర్ ఎనర్జీకి చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కోనార్క్' ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్, ఫ్యామిలీ ఈ-స్కూటర్ వేరియంట్లు, ధరలు, ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలో తెలిపే పూర్తి సమాచారం మీ కోసం..

Published on: Sep 5, 2026, 06:21:03 IST
Advertisement

దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఏథర్ ఎనర్జీ.. మార్కెట్లో తన పట్టును మరింత బలపరుచుకునేందుకు మరో సరికొత్త మోడల్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించిన 'ఏథర్ రిజ్టా' విజయం తర్వాత, ఇప్పుడు ‘ఏథర్ కోనార్క్’ పేరిట ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మధ్యతరగతి వాహనదారులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ. 99,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. టాప్ వేరియంట్ ధర రూ. 1.45 లక్షల వరకు ఉంటుంది.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఏథర్​ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 kWh నుంచి 3.5 kWh వరకు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో, మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 100 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

పెట్రోల్ ధరలు మండిపోతున్న నేటి రోజుల్లో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక్కసారిగా రూ. 1 లక్ష నుంచి రూ. 1.45 లక్షలు చెల్లించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వారి కోసం బ్యాంక్ లోన్ ద్వారా ప్రతి నెలా సులభ వాయిదాలలో (ఈఎంఐ) ఈ స్కూటర్‌ను ఎలా కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు చూద్దాము.

ఏథర్ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈఎంఐ లెక్కలు ఇవే!

మీరు ఏథర్ కోనార్క్ ఈ- స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరపై 100% రుణం తీసుకున్నారని అనుకుందాం. వార్షిక వడ్డీ రేటును 9.5 శాతంగా లెక్కించి, రీపేమెంట్ గడువును 24 నెలలుగా (2 సంవత్సరాలు) ఎంచుకుంటే వేరియంట్ల వారీగా చెల్లించాల్సిన నెలవారీ ఈఎంఐ వివరాలు:

ఏథర్​ కోనార్క్- నెలవారీ ఈఎంఐ
మోడల్, వేరియంట్లోన్ ( ఎక్స్​షోరూం ధరపై 100%)వడ్డీ రేటురీపేమెంట్ వ్యవధినెలవారీ ఈఎంఐ
Ather Konarc S 2.1 kWhరూ. 99,9999.5%24 నెలలురూ. 4,591
Ather Konarc S 2.7 kWhరూ. 1.22 లక్షలురూ. 5,602
Ather Konarc S 3.5 kWhరూ. 1.45 లక్షలురూ. 6,658

కోనార్క్ ఎస్ (2.7 kWh): ఈ మిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.22 లక్షలు. దీనికి నెలకు సుమారు రూ. 5,602 ఈఎంఐ పడుతుంది.

కోనార్క్ ఎస్ (3.5 kWh): అత్యధిక రేంజ్ ఇచ్చే ఈ టాప్ మోడల్ ధర రూ. 1.45 లక్షలు. దీని నెలవారీ ఈఎంఐ సుమారు రూ. 6,658 వరకు ఉంటుంది.

కొనుగోలుదారులు గమనించాల్సిన విషయాలు..

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవి కేవలం ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. హైదరాబాద్ లేదా విజయవాడ వంటి నగరాల్లో రోడ్డు టాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్డు ధర మారవచ్చు.

అలాగే మీరు చెల్లించే డౌన్​పేమెంట్, ఎంచుకునే బ్యాంక్ వడ్డీ రేట్లు, లోన్ వ్యవధి (36 లేదా 48 నెలలు), షోరూమ్ ఆఫర్ల ఆధారంగా మీ నెలవారీ ఈఎంఐ మారే అవకాశం ఉంటుంది. రుణ గడువును పెంచుకుంటే ప్రతి నెలా కట్టే వాయిదా తగ్గినప్పటికీ, మొత్తం మీద పడే వడ్డీ భారం పెరుగుతుందని గుర్తుంచుకోండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe