MG Hector Tomahawk EV : 517 కి.మీ రేంజ్​ ఇచ్చే ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీలో.. ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్?

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్​కి చెందిన లేటెస్ట మోడల్​ హెక్టార్ టోమాహాక్ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారు? అయితే ఇది మీకోసమే. ఈ హెక్టార్ టోమాహాక్ ఈవీలో ఉన్న వేరియంట్లలో ఏది వాల్యూ ఫర్​ మనీ? ఎందుకు? అందులోని ఫీచర్లు ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 20, 2026, 10:45:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ'ని ప్రవేశపెట్టింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ప్రీమియం ఈవీ.. గరిష్టంగా రూ. 23.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. మరి మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇందులోని వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ..
ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ..

ఆడాప్ట్ ఎన్ఈవీ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త డిజైన్..

ఎంజీ కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన 'ఆడాప్ట్ ఎన్ఈవీ' మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మొదటి వాహనం ఇదే కావడం విశేషం. ఈ ఆర్కిటెక్చర్ వివిధ రకాల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాంకేతికతలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా 5-సీటర్, 7-సీటర్ లేఅవుట్లలో ఇవి లభిస్తున్నాయి.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీలోని ఈ మూడు వేరియంట్లలో ఏది ఎంచుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఫీచర్లు, ధరను సరిపోల్చి చూస్తే మిడ్​ రేంజ్ వేరియంట్ అయిన ‘ఎక్స్‌క్లూజివ్’ అత్యుత్తమ ‘వాల్యూ ఫర్ మనీ’ మోడల్‌గా నిలుస్తుంది. రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లభించే ఈ వేరియంట్, చెల్లించే ప్రతి రూపాయికి తగిన విలువను అందిస్తుంది!

ఎంజీ టోమాహాక్ ఈవీ ఎక్స్​క్లూజివ్ ఫీచర్లు..
  • ఎల్​ఈడీ ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్స్
  • 8.8-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే
  • 12.8-ఇంచ్ టచ్​స్క్రీన్ ఇన్​ఫోటైన్​మెంట్ సిస్టెమ్
  • యాంబియంట్ లైటింగ్ మోనో (బ్లూ)
  • పనోరమిక్ సన్​రూఫ్
  • ఫ్రెంట్ వెంటిలేటెడ్ సీట్స్
  • ఫాస్ట్ వైర్​లెస్ ఛార్జర్
  • ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్​గేట్
  • 6వే పవర్ అడస్టెబుల్ డ్రైవర్ సీట్
  • 4వే పవర్ అడ్జస్టెబుల్ కో-డ్రైవర్ సీట్
  • ఫాలో మీ హోమ్ హెడ్​ల్యాంప్స్
  • క్రూయిజ్ కంట్రోల్
  • 18-ఇంచ్ అలాయ్ వీల్స్
  • డెసర్ట్ స్క్వాడ్రన్ ఇంటీరియర్
  • పుష్ బటన్ స్టార్ట్/ స్టాప్ విత్ స్మార్ట్ ఎంట్రీ
  • వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లే
  • ఆటో అప్/డౌన్ విండోస్, యాంటీ పించ్ ఫంక్షన్
  • 6 స్పీకర్లు, ట్వీటర్లు
  • వాక్- అవే ఆటో కార్ లాక్, అప్రోచ్ ఆటో కార్ అన్​లాక్
  • ఆల్​ ఐ-స్మార్ట్ ఫీచర్స్
  • 3.3 kW పోర్టెబుల్ ఛార్జింగ్ కేబుల్
  • 7.4 kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ విత్ స్టాండర్డ్ ఇన్​స్టలేషన్
  • బీ పిల్లర్ కోట్ హుక్స్
  • డ్యూయెల్ హార్న్
  • రీడింగ్ లైట్స్ (ఫ్రెంట్ అండ్ రేర్)
  • సెకెండ్ రో ఈజీ టిప్ అండ్ టంబుల్ ఫర్ థర్డ్ రో యాక్సెస్
  • థర్డ్ రో 50:50 స్ల్పిట్ సీట్స్
  • 6 ఎయిర్​బ్యాగులు
  • ఆల్​ 4 డిస్క్ బ్రేక్స్
  • డ్రైవర్ మోడ్స్ - ఈకో, నార్మల్, స్పోట్స్, కస్టమ్
  • ఎల్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్
  • ఫాలో మీ హోమ్ హెడ్​ల్యాంప్స్
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్
  • 360-డిగ్రీ కెమెరా
  • ఆటోమేటిక్ హెడ్​ల్యాంప్స్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
  • అకౌస్టింగ్ అండ్ యూవీ కట్ గ్లాస్

ఎలక్ట్రిక్ ఎస్​యూవీలోని బేస్ వేరియంట్ 'ఎక్సైట్'తో పోలిస్తే, ఎక్స్‌క్లూజివ్ మోడల్‌లో అధునాతన సౌకర్యాలు లభిస్తాయి. ఇందులో వేడి, గాలులను నియంత్రించే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కూలింగ్ సౌకర్యంతో కూడిన 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జర్, బూట్ ఓపెన్ చేయడానికి ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్‌గేట్ వంటి రోజువారీ ప్రయాణాల్లో ఎంతో ఉపయోగపడే ఫీచర్లను అందించారు. నేటితరం కార్ల కొనుగోలుదారులు ఎక్కువగా కోరుకునే హంగులు ఇవే.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- 'బీఏఏఎస్' ఆఫర్..

పెద్ద కుటుంబాలు ఉండే మన దక్షినాది కొనుగోలుదారులకు ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లోని 7-సీటర్ ఆప్షన్ చక్కటి ఎంపికగా మారుతుంది. లోపల విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండటంతో లాంగ్ డ్రైవ్‌లు, ఫ్యామిలీ ట్రిప్పులు హాయిగా సాగుతాయి.

ప్రారంభ కొనుగోలు ఖర్చును తగ్గించుకోవాలనుకునే వారికి ఎంజీ అందిస్తున్న 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) పథకం ఎంతో ఊరటనిస్తుంది. ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా కారు ప్రారంభ ధరను గణనీయంగా తగ్గించుకోవచ్చు. బ్యాటరీకి విడిగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లిస్తే సరిపోతుంది.

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ- 517 కిలోమీటర్ల రేంజ్..

ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఏ వేరియంట్ ఎంచుకున్నా సామర్థ్యంలో ఎలాంటి వ్యత్యాసమూ ఉండదు. అన్ని వేరియంట్లలోనూ 69.2 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 201 బీహెచ్​పీ గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంఐడీసీ ప్రామాణికాల ప్రకారం ఏకంగా 517 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

అత్యుత్తమ రేంజ్, లగ్జరీ ఫీచర్లు, రీజనబుల్ ధర కోరుకునే వారికి ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ తిరుగులేని ఆప్షన్!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More