Maruti Suzuki Baleno : మారుతీ సుజుకీ బలేనో ఫేస్‌లిఫ్ట్.. ఈ వేరియంట్ కొంటేనే పైసా వసూల్!
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 2026 బలెనోలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్, దాని ధర, ఫీచర్లు వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన 'బలెనో'ను మారుతీ సుజుకీ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలోనే 2026 బలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇటీవలే లాంచ్ చేసింది. ఈ మోడల్లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ ఇంజిన్, ఈ సెగ్‌మెంట్‌లోనే మొదటిసారిగా లెవెల్-2 అడాస్ సేఫ్టీ సూట్‌ను పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. టాటా అల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి బలమైన ప్రత్యర్థులకు ఇది నేరుగా సవాలు విసురుతోంది.

గత కొన్నేళ్లుగా భారతదేశంలో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాలు కొంత ఒడుదొడుకులకు గురైనప్పటికీ, జీఎస్టీ రేట్ల తగ్గింపు, కార్ల నిర్వహణ వ్యయం పెరగడం, ఆర్బీఐ రెపో రేటు స్థిరంగా ఉండటంతో మళ్లీ చిన్న కార్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. పండుగల సీజన్‌లో ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో మారుతీ సుజుకీ ఈ 2026 బలెనోపైనే భారీగా ఆశలు పెట్టుకుంది.
మరి మీరు మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌ని కొనాలని ప్లాన్ చేస్తున్నారు? అయితే, ఇందులోని వాల్యూ ఫర్ మనీ వేరియంట్ వివరాలను ఇక్కడ చూసేయండి..
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
సాధారణంగా చాలామంది బలెనో మోడల్‌లోని ‘జీటా’ వేరియంట్‌ను సరైన ఎంపికగా భావిస్తుంటారు. అయితే, బడ్జెట్, లభించే ఫీచర్లను బేరీజు వేస్తే ‘డెల్టా’ వేరియంట్ అత్యంత ఉత్తమమైన 'వాల్యూ ఫర్ మనీ' ఆప్షన్‌గా నిలుస్తుంది.
జీటా వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షల నుంచి రూ. 8.92 లక్షల మధ్య ఉంటే, డెల్టా వేరియంట్ రూ. 7 లక్షల నుంచి రూ. 7.92 లక్షలకే లభ్యమవుతోంది!. దాదాపు లక్ష రూపాయల వ్యత్యాసంలోనే రోజువారీ అవసరాలకు కావాల్సిన ప్రధాన ఫీచర్లన్నీ డెల్టాలో అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ 'సిగ్మా' కంటే పైస్థాయిలో ఉండే ఈ డెల్టా వేరియంట్‌లో పెట్రోల్ తో పాటు సీఎన్జీ ఆప్షన్లు, మ్యాన్యువల్తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా లభిస్తున్నాయి.
మారుతీ సుజుకీ బలెనో ఫేస్‌లిఫ్ట్- ఎక్స్టీరియర్, కలర్స్..
డెల్టా వేరియంట్‌లో సిల్వర్ ఇన్సర్‌తో కూడిన నయా ఫ్రంట్ గ్రిల్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్‌లు, ఆకర్షణీయమైన ఫ్రంట్ బంపర్ అమర్చారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్లు, 15-ఇంచుల స్టీల్ వీల్స్ (వీల్ కవర్లతో), పైన షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి హంగులు ఉన్నాయి.
రంగుల విషయానికొస్తే స్ల్పెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండ్యూర్ గ్రే ఆప్షన్లతో పాటు అదనంగా ఆపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ అనే రెండు కొత్త రంగులను కూడా ఈ వేరియంట్‌లో అందించారు.
మారుతీ సుజుకీ ఫేస్‌లిఫ్ట్- ఇంటీరియర్, భద్రత..
2026 బలెనోలోని డెల్టా వేరియంట్ క్యాబిన్ లోపల డ్యూయల్ టోన్ బ్లూ, గ్రే థీమ్ లభిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై అల్యూమినియం ఫినిషింగ్ ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 7.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, వెనుక ప్రయాణికులకు ఏసీ వెంట్లు, టైప్-సి ఛార్జింగ్ పోర్టులను అమర్చారు.
ప్రయాణికుల భద్రతకు సంబంధించి మారుతీ సుజుకీ ఈ వేరియంట్‌లోనూ రాజీ పడలేదు. ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, సీట్ బెల్ట్ ప్రి-టెన్షనర్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ప్రమాణికంగా అందించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


