టాటా మోటార్స్ తమ పాపులర్ టిగోర్ స్థానంలో సరికొత్త డిజైన్, అధునాతన సాంకేతికతతో 'టాటా ఏరిస్' కాంపాక్ట్ సెడాన్‌ను ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే రూ. 5.29 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తున్న ఈ కారు మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాలకు గట్టి పోటీనిస్తోంది. మరి పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో వచ్చిన ఈ టాటా ఏరిస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇందులోని వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరలు, వాల్యూ ఫర్ మనీ మోడల్ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా ఏరిస్ ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు..

టాటా ఏరిస్‌లో నమ్మకమైన 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు.
పెట్రోల్ వర్షన్: ఇది 86 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సీఎన్జీ వర్షన్: ఇది 75 బీహెచ్పీ పవర్, 96.5 ఎన్ఎం టాక్‌ను అందిస్తుంది.
ఈ రెండు ఇంధన మోడళ్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బూట్ స్పేస్ కోల్పోకుండా టాటా పేటెంట్ ట్విన్-సిలిండర్ సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.
| టాటా ఏరిస్- వేరియంట్ల వారీగా ధరలు, ఇంజిన్, ఫీచర్లు | |||||
|---|---|---|---|---|---|
| వేరియంట్లు | స్మార్ట్ | ప్యూర్ | ప్యూర్+ | క్రియేటివ్ | అకంప్లీష్డ్ |
| ఎక్స్‌షోరూం ధర | రూ. 5.29 లక్షలు - రూ. 6.29 లక్షలు | రూ. 6.14 లక్షలు - రూ. 7.69 లక్షలు | రూ. 6.74 లక్షలు - రూ. 8.29 లక్షలు | రూ. 7.49 లక్షలు - రూ. 9.04 లక్షలు | రూ. 8.19 లక్షలు - రూ. 9.74 లక్షలు |
| ఇంజిన్- ట్రాన్స్మిషన్ |
|
|
|
|
|
| ఫీచర్లు |
| స్మార్ట్‌తో పాటు
| ప్యూర్తో పాటు
| ప్యూర్+ తో పాటు
| క్రియేటివ్‌తో పాటు
|
టాటా ఏరిస్- ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్..
చెల్లించే ధరకు, పొందే ఫీచర్లను బట్టి చూస్తే టాటా ఏరిస్ క్రియేటివ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. టాప్ వేరియంట్ అకంప్లిష్డ్తో పోలిస్తే తక్కువ ధరకే 10.25-ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అలాయ్ వీల్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. మరోవైపు, నగర ప్రయాణాల్లో ట్రాఫిక్ నివారణకు, తక్కువ రన్నింగ్ కాస్ట్‌కు సీఎన్జీ ఆటోమేటిక్ కాంబినేషన్ అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది.
{{/usCountry}}చెల్లించే ధరకు, పొందే ఫీచర్లను బట్టి చూస్తే టాటా ఏరిస్ క్రియేటివ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. టాప్ వేరియంట్ అకంప్లిష్డ్తో పోలిస్తే తక్కువ ధరకే 10.25-ఇంచుల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అలాయ్ వీల్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. మరోవైపు, నగర ప్రయాణాల్లో ట్రాఫిక్ నివారణకు, తక్కువ రన్నింగ్ కాస్ట్‌కు సీఎన్జీ ఆటోమేటిక్ కాంబినేషన్ అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది.
{{/usCountry}}మరి మీరు ఈ టాటా ఏరిస్ కాంపాక్ట్ సెడాన్‌ని కొంటున్నారా?