Deputy CM Pawan Health : పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఆరోగ్య పరిస్థితిపై ఆరా..!
AP Deputy CM Pawan Kalyan Health : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు శనివారం సర్జరీ జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సినీ, రాజకీయ ప్రముఖలు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఫోన్ లో పరామర్శ…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం పవన్ కల్యాణ్‌కు స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని… ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాల గురించి మోడీ ఆరా తీశారు. దాదాపు నిమిషం పాటు సాగిన ఈ సంభాషణలో పవన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజా సేవలో నిరంతరం శ్రమించే క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించినట్లు సమాచారం.
ఫోన్ కాల్ మాత్రమే కాకుండా… ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను”అని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కల్యాణ్… ఇటీవలి కాలంలో వరుస సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారులతో పాలనాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకున్నారు. పరిస్థితిని గమనించిన వైద్యులు… ఆ రోజు జరగాల్సిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని ఆసుపత్రికి రావాలని సూచించారు.
ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్‌కు వైద్యులు వివిధ రకాల పరీక్షలతో పాటు ఎం.ఆర్.ఐ. (MRI) స్కాన్ కూడా నిర్వహించారు. పరీక్షా ఫలితాలను విశ్లేషించిన నిపుణులు, తక్షణమే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. శస్త్రచికిత్స తర్వాత ఆయన కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే ఆయన మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

