...
...
Next Story

ప్రధాని మోదీ చేతుల మీదుగా గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం ఆవిష్కరణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవా పర్యటనలో భాగంగా, శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం యొక్క 550వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం అభివృద్ధి చేసిన రామాయణ థీమ్ పార్క్‌ను కూడా మోదీ ప్రారంభించారు.

Published on: Nov 28, 2025, 17:51:08 IST
Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన భారీ 77 అడుగుల కాంస్య శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550వ వార్షికోత్సవ వేడుకలు (శార్ద పంచశతామానోత్సవం)లో భాగంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది.

రామాయణ థీమ్ పార్క్ ప్రారంభం

ప్రధాని మోదీ చేతుల మీదుగా గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం ఆవిష్కరణ (@NarendraModi)
ప్రధాని మోదీ చేతుల మీదుగా గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహం ఆవిష్కరణ (@NarendraModi)

కేవలం విగ్రహావిష్కరణే కాకుండా, రామాయణ థీమ్ పార్క్‌ను కూడా మోదీ ప్రారంభించారు. ఈ పార్క్‌ను మఠం ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. రామాయణ ఇతిహాసంలోని ముఖ్య ఘట్టాలను కళా రూపాలు, ఇన్‌స్టాలేషన్ల ద్వారా ప్రదర్శించేలా ఈ థీమ్ పార్క్‌ను రూపొందించారు. ఈ పవిత్ర సందర్భానికి గుర్తుగా, ప్రధానమంత్రి ఒక ప్రత్యేక పోస్టల్ స్లాంప్, ఒక స్మారక నాణెం విడుదల చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఉడుపిలో గీతా పారాయణం, రోడ్‌షో

గోవాకు రాకముందు, ప్రధాని మోదీ కర్ణాటకలోని ఉడుపిలో పర్యటించారు. అక్కడ ఆయన లక్ష కంఠ గీతా పారాయణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ మఠంలో లక్ష మందికి పైగా పాల్గొని భగవద్గీత శ్లోకాలను ఏకధాటిగా జపించారు. ఇందులో విద్యార్థులు, పండితులు, సన్యాసులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఉడుపిలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్డు పొడవునా బారులు తీరిన ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

కనక కవచం అంకితం

ఉడుపి పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ ప్రధాన కృష్ణ ఆలయానికి సమీపంలో ఉన్న సువర్ణ తీర్థ మండపాన్ని కూడా ప్రారంభించారు. అంతేకాకుండా, పవిత్రమైన కనకన కిండి (Kanakan Kindi)కి బంగారు పూత పూసిన కనక కవచాన్ని అంకితం చేశారు. కవి-సన్యాసి కనకదాస శతాబ్దాల క్రితం ఈ చిన్న కిటికీ నుండే శ్రీకృష్ణుడిని చూసినట్లు భక్తులు నమ్ముతారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks