9000 ఎంఏహెచ్ బ్యాటరీతో Poco X8 Pro Max- ఈరోజే లాంచ్..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన శక్తివంతమైన ఎక్స్8 సిరీస్‌ను మంగళవారం భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ముఖ్యంగా ఇండియాలో లాంచ్ అవుతున్న పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ 5జీ మోడల్‌లో ఏకంగా 9,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించడం విశేషం. గ్లోబల్ వేరియంట్ కంటే ఇండియాలో వచ్చే ఫోన్‌కే ఎక్కువ పవర్ ఉండనుంది.
టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోకో ఎక్స్8 సిరీస్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఒక గ్రాండ్ ఈవెంట్లో సంస్థ ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేయనుంది. అవి.. పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్, పోకో ఎక్స్8 ప్రో. ఈ రెండు కూడా 5జీ గ్యాడ్జెట్సే. కాగా, లాంచ్‌కి ముందు ఈ మోడల్స్‌కి సంబంధించిన కొన్ని కీలక వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

పోకో ఎక్స్8 సిరీస్- ఇండియన్ వేరియంట్‌కే పవర్ ఎక్కువ!
సాధారణంగా గ్లోబల్ వేరియంట్లు మెరుగ్గా ఉంటాయని అందరూ భావిస్తారు, కానీ ఈసారి పోకో భిన్నంగా ఆలోచించింది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదలయ్యే పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడల్‌లో 8,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, భారతదేశంలో మాత్రం దీనిని 9,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్లలో ఒకటిగా నిలవనుంది. మరోవైపు ప్రో మోడల్ గ్లోబల్, ఇండియాలోనూ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.
పోకో ఎక్స్8 సిరీస్- డిస్‌ప్లే, కెమెరా విశేషాలు..
డిస్‌ప్లే: ప్రో మ్యాక్స్ వేరియంట్ 6.83- ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ప్రో మోడల్‌లో 6.59- ఇంచ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది.
కెమెరా: రెండు ఫోన్లలోనూ వెనుక వైపు 'పిల్ షేప్' కెమెరా మాడ్యూల్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ప్రోసెసర్: ప్రో మ్యాక్స్ మోడల్‌లో శక్తివంతమైన 3ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9500ఎస్ చిప్‌సెట్ ఉండగా, ప్రో వేరియంట్‌లో 4ఎన్ఎం డైమెన్సిటీ 8500 అల్ట్రా ఎస్ఓసీని అమర్చారు.
పోకో ఎక్స్8 సిరీస్- స్టోరేజ్, ఇతర ఫీచర్లు..
మెమరీ విషయానికి వస్తే, పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడల్ 12 GB+256 GB, 12 GB+512 GB వేరియంట్లలో లభించనుంది. పోకో ఎక్స్8 ప్రో మోడల్ మాత్రం 8 GB+256 GB, 8 GB+512 GB, 12 GB+512 GB అనే మూడు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భద్రత కోసం ప్రో మ్యాక్స్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అదనంగా పోకో ఎక్స్8 ప్రో మ్యాక్స్‌లో 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
ముఖ్యంగా ఈ ఫోన్లు ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP66 నుంచి IP69K వరకు టాప్ గ్రేడ్ రేటింగ్స్‌ను కలిగి ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. లాంచ్ తర్వాత వీటి ధరతో పాటు ఇతర వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


