Xiaomi 17 Ultra : అదిరే బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌తో షావోమీ 17 సిరీస్ లాంచ్- ధర ఎంతంటే..
Xiaomi 17 Ultra price: అదిరే బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్స్‌తో షావోమీ 17 సిరీస్ లాంచ్ అయ్యింది. ఇందులో షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా పేర్లతో రెండు మోడల్స్ ఉన్నాయి. వీటి ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ 'షావోమీ 17'ను అంతర్జాతీయ మార్కెట్లలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. చైనాకు చెందిన ఈ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ (ఓఈఎం) నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ లైనప్‌లో షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా అనే రెండు మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు క్వాల్కమ్కి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో ఈ మొబైల్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

షావోమీ 17, షావోమీ 17 అల్ట్రా: ధరల వివరాలు..
షావోమీ 17: ఈ స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర 999 యూరోలు (సుమారు రూ. 1,07,449)గా నిర్ణయించారు. ఇది ఆల్పైన్ పింక్, బ్లాక్, ఐస్ బ్లూ, వెంచర్ గ్రీన్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
షావోమీ 17 అల్ట్రా: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అంతర్జాతీయ మార్కెట్లలో 1,499 యూరోలు (సుమారు రూ. 1,61,264)గా ఉంది. ఇది బ్లాక్, స్టార్‌లిట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఫోటోగ్రఫీ కిట్స్: కస్టమర్లు షావోమీ 17 అల్ట్రా ఫోటోగ్రఫీ కిట్, ఫోటోగ్రఫీ కిట్ ప్రోలను కూడా కొనుగోలు చేయవచ్చు. వీటి ధరలు వరుసగా 99.99 యూరోలు (సుమారు రూ. 10,757), 199.99 యూరోలు (సుమారు రూ. 21,515)గా ఉన్నాయి.
షావోమీ 17 అల్ట్రా: ఫీచర్లు..
డ్యూయల్ సిమ్ (నానో + నానో) కలిగిన షావోమీ 17 అల్ట్రా, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3పై పనిచేస్తుంది
డిస్‌ప్లే: ఇది 6.9- ఇంచ్ 1.5కే ఎల్టీపీఓ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,060 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 3 రక్షణ ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్: 3ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, అడ్రినో 840 జీపీయూ, 16 జీబీ LPDDR5x అల్ట్రా ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ కలవు.
కెమెరా: లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది.
1- ఇంచ్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50ఎంపీ LOFIC ఓమ్నీవిజన్ 1050ఎల్ ప్రధాన కెమెరా.
50 ఎంపీ శాంసంగ్ జేఎన్5 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా.
200 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా.
సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 ఎంపీ OV50M కెమెరా ఉంది.
కనెక్టివిటీ అండ్ బ్యాటరీ: 5జీ, 4జీ ఎల్టీఈ, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్సీ, వైఫై 7, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. ధూళి, నీటి నిరోధకత కోసం ఐపీ66 + ఐపీ68 + ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. భద్రత కోసం 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఇది 90డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే 22.5డబ్ల్యూ వద్ద రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉంది.
షావోమీ 17: ఫీచర్లు..
స్టాండర్డ్ షావోమీ 17 మోడల్ 6.3- ఇంచ్ 1.5కే (2,656x1,220 పిక్సెల్స్) ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.
డిస్‌ప్లే: ఇందులో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 300హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్క్రీన్ 19.6:9 యాస్పెక్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గామట్, హెచ్డీఆర్ 10+, హెచ్డీఆర్ వివిడ్, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
హార్డ్‌వేర్: ఇది అల్ట్రా మోడల్‌లో ఉన్న చిప్‌సెట్, కనెక్టివిటీ ఆప్షన్లనే కలిగి ఉంది. ఇందులో 12 జీబీ LPDDR5T ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందించారు.
కెమెరా: లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఎఫ్/1.67 అపెర్చర్- 23 ఎంఎం ఫోకల్ లెంగ్త్‌తో కూడిన 50ఎంపీ ప్రధాన కెమెరా.
50 ఎంపీ (ఎఫ్/2.0) టెలిఫోటో లెన్స్.
102-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 50 ఎంపీ (ఎఫ్/2.4) అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్.
ముందు భాగంలో f/2.2 అపెర్చర్, 90-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగిన 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
బ్యాటరీ: స్టాండర్డ్ షావోమీ 17లో 6,330 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


