Realme C83 5G : 7000 ఎంఏహెచ్​ బ్యాటరీతో రియల్​మీ కొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​- ధర, లాంచ్​ వివరాలు..

Realme C83 5G India Launch Date : బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించే రియల్‌మీ, తన సరికొత్త 'సీ83 5జీ' స్మార్ట్‌ఫోన్‌న్​ త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. 7,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ రాబోతోంది.

Published on: Feb 26, 2026, 14:01:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ.. తన పాపులర్ సీ- సిరీస్‌లో సరికొత్త 'రియల్‌మీ సీ83 5జీ'ని భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే ఈ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇదొక బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఇప్పటికే ప్రత్యక్షమైంది. ఈ స్మార్ట్​ఫోన్ ధర, బ్యాటరీ, డిజైన్ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

రియల్​మీ సీ83 5జీ లాంచ్​ ఎప్పుడంటే.. (Representative image)
రియల్​మీ సీ83 5జీ లాంచ్​ ఎప్పుడంటే.. (Representative image)

రియల్​మీ సీ83 5జీ- మార్చి 7న గ్రాండ్ లాంచ్..

రియల్‌మీ సీ83 5జీ స్మార్ట్‌ఫోన్ మార్చి 7వ తేదీన, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. లాంచ్ అయిన వెంటనే రియల్‌మీ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. ఇది ‘బ్లూమింగ్ పర్పుల్’, ‘స్పౌటింగ్ గ్రీన్’ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.

రియల్​మీ సీ83 5జీ- బ్యాటరీ..

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 7,000 ఎంఏహెచ్​ టైటాన్ బ్యాటరీ.

బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 27.7 గంటల వీడియో ప్లేబ్యాక్, సుమారు 6.65 రోజుల మ్యూజిక్ ప్లేబ్యాక్, 37 రోజుల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆరు ఏళ్ల భరోసా: ఈ బ్యాటరీ ఆరు సంవత్సరాల వరకు హెల్తీగా ఉంటుందని రియల్‌మీ హామీ ఇస్తోంది.

ఛార్జింగ్: ఇందులో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

రియల్​మీ సీ83 5జీ- డిజైన్, డిస్‌ప్లే..

రియల్‌మీ సీ83 5జీ ఫ్లాట్ ఫ్రేమ్, ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో వస్తోంది. వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఒక దీర్ఘచతురస్రాకార ఐలాండ్‌లో అమర్చి ఉంటుంది.

రిఫ్రెష్ రేట్: గేమింగ్, స్క్రోలింగ్ స్మూత్‌గా ఉండటం కోసం 144హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందించారు.

డ్యూరబిలిటీ: దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్, అలాగే షాక్ రెసిస్టెన్స్ కోసం MIL-STD 810H సర్టిఫికేషన్ కూడా ఉంది.

రియల్​మీ సీ83 5జీ- ధర, వేరియంట్లు (అంచనా)..

లీకైన సమాచారం ప్రకారం, ఈ రియల్‌మీ సీ83 5జీ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ధరలు భారత్‌లో ఇలా ఉండవచ్చు:

4 జీబీ + 64 జీబీ: రూ. 13,499

4 జీబీ + 128 జీబీ: రూ. 14,499

6 జీబీ + 128 జీబీ : రూ. 17,499

బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక గొప్ప ఎంపిక కానుందని టెక్​ నిపుణులు చెబున్నారు. లాంచ్​ నాటికి ఈ గ్యాడ్జెట్​కి చెందిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More