శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా.. ఇప్పట్లో లాంచ్ అవ్వదా?
శాంసంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్! జనవరి బదులు ఫిబ్రవరిలో ఫోన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు లీకులు అందుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
శాంసంగ్ గెలాక్సీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్26 సిరీస్ లాంచ్‌పై తాజాగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది జనవరిలోనే తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను పరిచయం చేసే శాంసంగ్, ఈసారి తన షెడ్యూల్‌ను కాస్త మార్చినట్లు కనిపిస్తోంది! లేటెస్ట్ లీకుల ప్రకారం.. గెలాక్సీ ఎస్26 అల్ట్రాతో కూడిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫిబ్రవరిలో గ్రాండ్ లాంచ్.. మార్చిలో విక్రయాలు?
సాధారణంగా శాంసంగ్ తన ఎస్ సిరీస్ ఫోన్లను జనవరి చివరి వారంలో లాంచ్ చేసి, ఫిబ్రవరిలో విక్రయాలకు తీసుకొస్తుంది. అయితే, ప్రముఖ టిప్‌స్టర్ ‘ఐస్ యూనివర్స్’ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' ఈవెంట్ ఈసారి ఫిబ్రవరిలో జరగనుంది. ఈ లెక్కన వినియోగదారులకు ఈ ఫోన్లు మార్చి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ ఎస్26 అల్ట్రాతో పాటు మొత్తం సిరీస్ లాంచ్ కాస్త ఆలస్యమైందన్న వార్తలకు ఈ లీక్ మరింత బలాన్ని చేకూరుస్తోంది.
మునుపటి రికార్డులు ఏం చెబుతున్నాయి?
గత నెలలో వచ్చిన కొన్ని నివేదికలు మాత్రం శాంసంగ్ తన పాత పద్ధతినే అనుసరిస్తుందని, జనవరి చివరలోనే ఫోన్లను ప్రకటిస్తుందని పేర్కొన్నాయి. కానీ గత చరిత్రను చూస్తే ఫిబ్రవరి లాంచ్ అనేది శాంసంగ్‌కు కొత్తేమీ కాదు. గెలాక్సీ ఎస్22, ఎస్23 సిరీస్‌లు కూడా ఫిబ్రవరిలోనే మార్కెట్లోకి వచ్చాయి. అందుకే తాజా లీకులను కొట్టిపారేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, శాంసంగ్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా సహా సిరీస్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్స్‌పై ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కంపెనీ దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ కథ ముగిసినట్లేనా?
గెలాక్సీ ఎస్26 సిరీస్‌లో 'ఎడ్జ్' మోడల్ రాబోతుందంటూ గతంలో ప్రచారం జరిగింది. ఐఫోన్ 17 ఎయిర్‌కు పోటీగా అత్యంత సన్నని డిజైన్‌తో దీన్ని తీసుకువస్తారని అందరు భావించారు. అయితే, మునుపటి మోడల్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో శాంసంగ్ ఈ 'ఎడ్జ్' ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు సమాచారం.
గెలాక్సీ ఎస్26 ప్లస్ మోడల్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.
డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయి?
లీకైన సీఏడీ రెండర్స్ ప్రకారం.. గెలాక్సీ ఎస్26 ప్లస్ సుమారు 7.35ఎంఎం మందంతో ఉండనుంది. ఇది దాదాపు పాత మోడల్ మందంతోనే సమానం. మరోవైపు, ఈ సిరీస్ లేట్ అవ్వడానికి బ్యాటరీ టెక్నాలజీలో మార్పులు లేదా ప్రాసెసర్ల సరఫరాలో జాప్యం కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


