శాంసంగ్ 'గెలాక్సీ డేస్' సేల్ షురూ- ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్లు! త్వరపడండి..

శాంసంగ్ 'గెలాక్సీ డేస్' సేల్ ప్రారంభమైంది. శాంసంగ్​ స్మార్ట్​ఫోన్స్​తో పాటు ఇతర పరికరాలపై ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచే భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఆ ఆఫర్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి…

Published on: Dec 16, 2025, 13:01:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీరు కొత్త శాంసంగ్ పరికరాన్ని కొనుగోలు చేయాలని లేదా నెక్ట్స్​ జన్​ ఫోన్​కి అప్‌గ్రేడ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంటే, మీకు శుభవార్త! శాంసంగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేదికగా తమ ‘గెలాక్సీ డేస్’ సేల్‌ను ప్రారంభించింది!

శాంసంగ్ 'గెలాక్సీ డేస్' సేల్ షురూ (Ijaj Khan/ HT Tech)
శాంసంగ్ 'గెలాక్సీ డేస్' సేల్ షురూ (Ijaj Khan/ HT Tech)

శాంసంగ్ ప్రకటించిన ఈ మొదటి ఎడిషన్ గెలాక్సీ డేస్ సేల్ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 18, 2025 వరకు, అంటే మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సేల్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ సేల్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై ఫోకస్​ చేయడంతో పాటు, అదే ప్లాట్‌ఫామ్ ద్వారా లభించే శాంసంగ్​ వేరబుల్స్, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్‌లను కవర్ చేస్తుంది.

ఈ ఈవెంట్ సమయంలో కొనుగోలుకు సంబంధించిన అనేక ప్రయోజనాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని శాంసంగ్ యోచిస్తోంది. ఇందులో ఎక్స్​ఛేంజ్​ ఆధారిత సేవింగ్స్​, బండిల్-లింక్డ్ ధర తగ్గింపులు, డివైజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లు, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే (అర్హత గల) కొనుగోలుదారుల కోసం రివార్డ్ ఆధారిత ప్రోత్సాహకాలు ఉంటాయి.

శాంసంగ్​ గెలాక్సీ డేస్​ సేల్​- ఆఫర్లు..

గెలాక్సీ డేస్ సందర్భంగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై శాంసంగ్ ఎక్స్​ఛేంజ్​ సంబంధిత బెనిఫిట్స్​ని అందిస్తుంది. అర్హత గల పాత పరికరాలను ట్రేడ్ చేసే కొనుగోలుదారులు రూ. 12,000 వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్‌ను పొందవచ్చు.

అయితే ఫైనల్​ ఎక్స్​ఛేంజ్​ విలువ, మీరు ట్రేడ్ చేసే మోడల్‌పై, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న గెలాక్సీ డివైజ్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ తమ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎక్స్​ఛేంజ్​ ప్రక్రియను నిర్వహిస్తుంది.

  • మారుతీ సుజుకీ కార్లపై ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​- రూ. 2.2 లక్షల వరకు డిస్కౌంట్లు- పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

శాంసంగ్, పెయిర్-అప్ ఆఫర్‌ల కింద బండిల్ ఆధారిత పొదుపులను కూడా అందిస్తుంది. అర్హత గల గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లు, అదే ఆర్డర్‌లో కొనుగోలు చేసిన గెలాక్సీ వేరబుల్స్, యాక్సెసరీస్‌పై రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కొన్ని గెలాక్సీ వేరబుల్స్, ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు కూడా ఈ సేల్‌లో భాగమవుతాయని శాంసంగ్ ధృవీకరించింది.

శాంసంగ్ కేర్+ ఆప్షన్..

గెలాక్సీ డేస్ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారికి శాంసంగ్ కేర్+ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొటెక్షన్ ప్లాన్, అర్హత గల పరికరాలకు యాక్సిడెంటల్​ డ్యామేజ్​, లిక్విడ్​ డ్యామేజ్​ వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది.

కస్టమర్‌లు తమ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేటప్పుడు ఈ సర్వీస్​ని యాడ్ చేసుకోవచ్చు. తమ పరికరాలను ఎక్కువ కాలం ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారుల కోసం ఈ ఆప్షన్‌ను అందిస్తున్నట్లు శాంసంగ్ పేర్కొంది.

గెలాక్సీ డేస్ సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లోని శాంసంగ్ బ్రాండ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసే వినియోగదారులు అర్హత గల లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్స్​ను సంపాదించవచ్చు.

అదనంగా, ఈ సేల్ సమయంలో శాంసంగ్ పరిమిత సమయం వరకు రివార్డ్ కార్యకలాపాలను ప్రకటించింది. కొంతమంది వినియోగదారులకు మిస్టరీ బాక్స్‌ల యాక్సెస్ లభించవచ్చు. దీని ద్వారా ఈవెంట్ సమయంలో ఎంపిక చేసిన గెలాక్సీ మోడల్‌లపై ఉపయోగించదగిన కూపన్‌లను అన్‌లాక్ చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More