మారుతీ సుజుకీ కార్లపై ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​- రూ. 2.2 లక్షల వరకు డిస్కౌంట్లు..

మారుతీ సుజుకీ వాహనాలపై రూ. 2.2 లక్షల వరకు ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​ లభిస్తున్నాయి. డిసెంబర్​ 31 వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. మీరు ఒకవేళ కారు కొనాలని ప్లాన్​ చేస్తుంటే, మారుతీ సుజుకీ మోడల్స్​, వాటిపై లభిస్తున్న డిస్కౌంట్స్​ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Dec 16, 2025, 10:40:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారీ ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​ ఇస్తున్న ఆటోమొబైల్​ సంస్థల జాబితాలో మారుతీ సుజుకీ కూడా చేరింది. అరెనా నుంచి నెక్సా వరకు అనేక మోడల్స్​పై ఈ డిసెంబర్​ 2025లో దాదాపు రూ. 2.2 లక్షల వరకు బెనిఫిట్స్​ని అందిస్తోంది.

మారుతీ సుజుకీ వాహనాలపై ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​..
మారుతీ సుజుకీ వాహనాలపై ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​..

మారుతీ సుజుకీ ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​..

ఆఫర్ వివరాలు: ఈ బెనిఫిట్స్​లో డైరక్ట్​ క్యాష్​ డిస్కౌంట్​ , ఎక్స్​ఛేంజ్​ లేదా స్క్రాపేజ్ బోనస్‌లు, కార్పొరేట్ లేదా సంస్థాగత పథకాలు, గ్రామీణ ప్రాంతాల కోసం ప్రత్యేక ఆఫర్లు వంటివి ఉన్నాయి.

అయితే, ఈ బెనిఫిట్స్​ అనేవి మోడల్, వేరియంట్, డీలర్‌షిప్, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

ఈ బెనిఫిట్స్​ అనేవి ప్రస్తుత సంవత్సరం నాటి వాహనాల స్టాక్‌ను క్లియర్ చేయాలని ఆటోమేకర్, దాని డీలర్‌షిప్‌లు లక్ష్యంగా పెట్టుకోవడంతో వచ్చింది. ప్రస్తుతం మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియో అంతటా మంచి డిమాండ్‌ను చూస్తున్న సమయంలోనే ఈ ఇయర్​ ఎండ్​ ఆఫర్‌లు రావడం గమనార్హం. ఈ ఆఫర్స్​ డిసెంబర్ 31 వరకు పొందవచ్చు.

ఏ వాహనంపై ఎంత లాభం?

మారుతీ సుజుకీ తమ మొత్తం ప్యాసింజర్ వెహికల్ లైనప్‌లో ఇయర్​ ఎండ్​ బెనిఫిట్స్​ని అందిస్తోంది.

నెక్సా ద్వారా లభించే ప్రధాన ఆఫర్లు:

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా: అత్యధికంగా రూ. 2.19 లక్షల విలువైన ప్రయోజనాలతో లభిస్తోంది.

ఎన్విక్టో ఎంపీవీ: ఈ వాహనంపై కూడా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

జిమ్నీ ఎస్​యూవీ: ఈ ఎస్‌యూవీపై రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

ఇగ్నిస్: ఈ మోడల్‌ను రూ. 82,000 విలువైన ప్రయోజనాలతో కొనుగోలు చేయవచ్చు.

మారుతీ సుజుకీ అరేనా ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​మారుతీ సుజుకీ నెక్సా ఇయర్​ ఎండ్​ ఆఫర్స్​
మోడల్స్​ఆఫర్స్​ (వరకు)మోడల్స్​ఆఫర్స్​ (వరకు)
ఆల్టో కే10రూ. 52,500ఇగ్నిస్​రూ. 82,100
ఎస్​-ప్రెస్సోరూ. 52,500బలెనోరూ. 57,100
వాగన్​ఆర్​రూ. 58,100ఫ్రాంక్స్​రూ. 65,000
సెలేరియోరూ. 52,500గ్రాండ్​ విటారారూ. 2.19 లక్షలు
స్విఫ్ట్​రూ. 55,000జిమ్నీరూ. 1 లక్ష
డిజైర్​రూ. 12,500ఎక్స్​ఎల్​6రూ. 50,000
ఎర్టిగారూ. 10,000ఎన్విక్టోరూ. 2.15 లక్షలు
ఈకోరూ. 52,500
బ్రెజారూ. 40,000

అరేనా ద్వారా లభించే ప్రధాన ఆఫర్లు:

వ్యాగన్ఆర్: అరేనా శ్రేణి వాహనాల్లో, వ్యాగన్ఆర్‌పై గరిష్టంగా రూ. 58,100 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

ఎర్టిగా: అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ అయిన ఎర్టిగాపై అతి తక్కువగా రూ. 10,000 విలువైన ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి.

ఇతర చిన్న కార్లు: ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఈకో వంటి చిన్న కార్లపై రూ. 52,500 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

బెస్ట్ సెల్లర్స్: మారుతీ సుజుకీకి ఉన్న బెస్ట్​ సెల్లర్లలో ఒకటైన స్విఫ్ట్​పై రూ. 55,000 విలువైన ప్రయోజనాలు, బ్రెజాపై రూ. 40,000 విలువైన బెనిఫిట్స్​ లభిస్తున్నాయి.

డిజైర్: కొత్త తరం మోడల్ విడుదలైనప్పటి నుంచి ఆదరణ మరింత పెరిగిన ఈ సెడాన్, డిసెంబర్ 2025లో రూ. 12,500 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More