ట్రావెలర్స్ కోసమే ఈ ప్రత్యేకమైన క్రెడిట్ కార్డులు- అదిరే డిస్కౌంట్స్‌తో పాటు బెనిఫిట్స్..
ట్రావెలర్స్‌కి గుడ్ న్యూస్! ట్రావెలింగ్ కోసమే రూపొందించిన కొన్ని క్రెడిట్ కార్డులతో అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్లు పొందొచ్చు. వీటి ద్వారా పెద్ద హోటళ్లల్లో బస చేయొచ్చు. విమానాశ్రయాల్లో లాంజ్‌లకు యాక్సెస్ పొందొచ్చు. పూర్తి వివరాలు..
మీరు తరచుగా ప్రయాణాలు చేసే వారైతే, క్రెడిట్ కార్డులు ఉపయోగించి మీరు పొందగలిగే అద్భుతమైన క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు ప్రముఖ హోటళ్లు, విమానయాన సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్ కార్డులను అందిస్తున్నాయి. వీటి ద్వారా వినియోగదారులు ఎంపిక చేసిన హోటళ్లు, విమానయాన సంస్థల్లో ప్రత్యేక తగ్గింపులు పొందవచ్చు!

ట్రావెలర్స్‌ని ఆకర్షణీయమైన ఆఫర్లను ఇచ్చే కొన్ని ప్రముఖ ట్రావెల్ క్రెడిట్ కార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన కార్డులు.
ప్రముఖ ట్రావెల్ క్రెడిట్ కార్డులు, ఆఫర్లు
ప్రయాణాలకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్డులు అనేక ఆఫర్స్, బెనిఫిట్స్‌ని అందిస్తాయి:
I. హెచ్‌డీఎఫ్‌సీ ఇన్ఫినియా కార్డ్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అందించే ఈ కార్డు ద్వారా అనేక కీలక ప్రయోజనాలు ఉన్నాయి:
ఎంపిక చేసిన ఐటీసీ హోటళ్లలో కాంప్లిమెంటరీ నైట్స్ (ఉచిత బస), బఫెట్ సౌకర్యం.
మొదటి సంవత్సరానికి క్లబ్ మారియట్ మెంబర్‌షిప్
కార్డు హోల్డర్‌తో పాటు యాడ్-ఆన్ మెంబర్‌కు కూడా ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయ లాంజ్‌లలో అపరిమిత ఉచిత ప్రవేశం.
గ్లోబల్ పర్సనల్ కన్సియార్జ్ సర్వీస్‌ను కూడా పొందవచ్చు.
II. యాక్సిస్ బ్యాంక్ అట్లాస్
పేరులోనే 'అట్లాస్' (ప్రపంచ పటం) ఉన్నట్లుగా, ఈ క్రెడిట్ కార్డును ప్రత్యేకంగా ప్రయాణికుల కోసమే రూపొందించారు.
- ప్రయాణ ఖర్చులపై 5 EDGE మైళ్లు లభిస్తాయి.
- ఇతర ఖర్చులపై 2 EDGE మైళ్లు పొందవచ్చు.
III. స్కాపియా ఫెడరల్ బ్యాంక్
ఫెడరల్ స్కాపియా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు అంతర్జాతీయ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్ సదుపాయాన్ని అందిస్తుంది.
వీసా కార్డుపై ప్రతి నెలా రూ. 10,000 లేదా రూపే కార్డుపై రూ. 15,000 ఖర్చు చేయడం ద్వారా దేశీయ లాంజ్‌లలో అపరిమిత ఎంట్రీ, కాంప్లిమెంటరీ డైనింగ్, షాపింగ్ లేదా స్పా వంటి ప్రయోజనాలను పొందవచ్చు.
IV. హెచ్‌ఎస్‌బీసీ ట్రావెల్ వన్
ఈ కార్డు విమానాలు, ట్రావెల్ ఏగ్రిగేటర్లు, విదేశీ కరెన్సీ లావాదేవీలపై ఖర్చు చేసినప్పుడు రెట్టింపు రివార్డు పాయింట్లను సంపాదించే అవకాశం కల్పిస్తుంది.
విస్తృతమైన ఎయిర్‌లైన్, హోటల్ భాగస్వాములతో తక్షణ రిడీమ్ సౌకర్యాన్ని అందించే మొదటి హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డు ఇదే.
V. యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్
ఈ కార్డు ద్వారా అంతర్జాతీయ, దేశీయ ఒబెరాయ్, ట్రైడెంట్ హోటళ్లలో గరిష్టంగా 15% వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది కాకుండా, ఈ కార్డు భారతదేశంలోని ఎంపిక చేసిన విమానాశ్రయ లాంజ్‌లకు అపరిమిత యాక్సెస్‌ని కూడా అందిస్తుంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. క్రెడిట్ కార్డు వినియోగం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


