సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి పరీక్షల జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల జవాబు పత్రాలను మొబైల్ ఫోన్లతో స్కాన్ చేశారని, ఇదొక పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. ఒక ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే టెండర్ నిబంధనలను మార్చారని మండిపడ్డారు.

సోషల్ మీడియా వేదికగా (X) రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని లేవనెత్తారు. జార్ఖండ్‌కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే 12వ తరగతి విద్యార్థి సేకరించిన టెండర్ వివరాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై, సీబీఎస్‌ఈ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"2025 మే నెలలో సీబీఎస్‌ఈ జారీ చేసిన టెండర్ నిబంధనల ప్రకారం.. జవాబు పత్రాలను ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్ల ద్వారా, కనీసం 300 డీపీఐ (DPI) స్పష్టతతో స్కాన్ చేయాల్సి ఉంది. కానీ, 2025 ఆగస్టులో తిరిగి జారీ చేసిన టెండర్‌లో ఈ నిబంధనలను నిశ్శబ్దంగా తొలగించారు. స్కానర్ల నిబంధనను సాధారణీకరించి, స్పష్టతను 200 డీపీఐకి తగ్గించారు," అని రాహుల్ గాంధీ వివరించారు.
'కోఎంప్ట్' సంస్థపై ఆరోపణలు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
నిబంధనల సడలింపు వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు బయటపడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' (Coempt EduTeck) అనే సంస్థ మొబైల్ ఫోన్లను ఉపయోగించి స్కానింగ్ చేసినట్లు వెల్లడైందని తెలిపారు. ఫలితంగా విద్యార్థులకు అస్పష్టమైన కాపీలు రావడం, పేజీలు గల్లంతవడం, కొన్ని జవాబు పత్రాలు అసలు స్కాన్ కాకపోవడం వంటి తీవ్ర సమస్యలు తలెత్తాయన్నారు.
ఇవి కేవలం సాంకేతిక పొరపాట్లు కావు అని, సదరు సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి కాంట్రాక్ట్ నిబంధనలను మార్చడం వల్ల జరిగిన నష్టమని ఆయన ఆరోపించారు. తప్పుగా మూల్యాంకనం జరిగిన ప్రతి విద్యార్థి ఈ మోసానికి బాధితుడేనని ఆవేదన వ్యక్తం చేశారు. 18.5 lakhs (18.5 లక్షల) మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి శోధనతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
{{/usCountry}}ఇవి కేవలం సాంకేతిక పొరపాట్లు కావు అని, సదరు సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి కాంట్రాక్ట్ నిబంధనలను మార్చడం వల్ల జరిగిన నష్టమని ఆయన ఆరోపించారు. తప్పుగా మూల్యాంకనం జరిగిన ప్రతి విద్యార్థి ఈ మోసానికి బాధితుడేనని ఆవేదన వ్యక్తం చేశారు. 18.5 lakhs (18.5 లక్షల) మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి శోధనతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
{{/usCountry}}జార్ఖండ్‌కు చెందిన విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ఉన్న టెండర్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాలను బయటపెట్టారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) కాంట్రాక్ట్ కోసం నిబంధనలను మూడు విడతలుగా ఎలా సడలించారో ఆయన ఆధారాలతో సహా తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఈ మార్పులన్నీ హైదరాబాద్‌కు చెందిన 'కోంఎప్ట్ ఎడ్యుటెక్' సంస్థ ప్రొఫైల్‌కు సరిపోయేలా చేశారని ఆ విద్యార్థి ఆరోపించారు. ఫలితాల తర్వాతి పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, మూల్యాంకనంలో అక్రమాలపై దేశవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ నివేదిక సంచలనంగా మారింది.
వెండర్ సంస్థపై చర్యలకు సీబీఎస్‌ఈ సిద్ధం
ఈ వివాదం తీవ్రం కావడంతో ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) సేవలను అందించిన హైదరాబాద్ సంస్థ 'కోంఎప్ట్ ఎడ్యుటెక్'పై చర్యలు తీసుకునేందుకు సీబీఎస్‌ఈ రంగం సిద్ధం చేసింది. 2025 ఆగస్టు టెండర్ నిబంధనల ప్రకారం సదరు సంస్థకు భారీ జరిమానాలు విధించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు.
టెండర్ లోని కఠిన నిబంధనలు ఇవే:
అధికారులు నివేదించిన తర్వాత సమస్యను పరిష్కరించడంలో ప్రతి 15 నిమిషాల ఆలస్యానికి రూ.1 లక్ష జరిమానా విధిస్తారు. సంస్థకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. నిబంధనల అతిక్రమణ కింద కాంట్రాక్ట్‌ను పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా బోర్డుకు ఉంది.