కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుకు నిరసనగా 'ఇండియా' కూటమి నాయకులు మంగళవారం చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు నీతి ఆయోగ్ కార్యాలయం నుంచి నిర్వాచన్ సదన్ వైపు మార్చ్ నిర్వహించారు.

పోలీసులు ఇనుప బ్యారికేడ్లతో దారి మళ్లించేందుకు యత్నించగా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహ్మాన్ బార్క్ తదితరులు బ్యారికేడ్లపైకి ఎక్కారు. రాహుల్ గాంధీ ఒక చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తాత్కాలిక నిర్బంధం
పోలీసులు ముందస్తు చర్యగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలేతో పాటు పలువురు విపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి, కొంతసేపటి తర్వాత విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "జ్ఞానేష్.. సమయం ముగిసింది భాయ్, ఇక రాజీనామా చేయండి" అని సీఈసీని ఉద్దేశించి పోస్ట్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు: మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "స్వాతంత్య్రం తర్వాత పౌరులకు లభించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కును మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా పూర్తిగా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటోంది" అని ఖర్గే ఆరోపించారు.
ఓటర్ల తొలగింపుపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసీఐ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఓటర్ల జాబితాలో నకిలీ సంతకాలతో ఓట్లను తొలగించారని ఆరోపించారు. "బీజేపీ తీవ్ర భయంలో ఉంది, అందుకే నగరమంతటా బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. ఈసీకి నిజాయితీ ఉంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. ఐదు కంటే ఎక్కువ ఓట్లు ఒకేసారి తొలగించకూడదనే నిబంధన ఉన్నా, 100కు పైగా బోగస్ ఫారమ్-7 దరఖాస్తులను దాఖలు చేశారు" అని నిలదీశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన పి.చిదంబరం
{{/usCountry}}సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈసీఐ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లోని ఓటర్ల జాబితాలో నకిలీ సంతకాలతో ఓట్లను తొలగించారని ఆరోపించారు. "బీజేపీ తీవ్ర భయంలో ఉంది, అందుకే నగరమంతటా బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. ఈసీకి నిజాయితీ ఉంటే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. ఐదు కంటే ఎక్కువ ఓట్లు ఒకేసారి తొలగించకూడదనే నిబంధన ఉన్నా, 100కు పైగా బోగస్ ఫారమ్-7 దరఖాస్తులను దాఖలు చేశారు" అని నిలదీశారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ప్రస్తావించిన పి.చిదంబరం
{{/usCountry}}మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఫారమ్-6 సవరణలపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. "ఫారమ్-6లో మార్పులకు మేము ఎలాంటి ఆమోదం తెలపలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బహిరంగ కోర్టులోనే స్పష్టంగా చెప్పారు..’ అని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితాలో పారదర్శకత పునరుద్ధరించే వరకు విపక్షాల 'సేవ్ డెమోక్రసీ' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి) ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.