RBI Monetary policy : వడ్డీ రేట్లు యథాతథం- భారత జీడీపీ వృద్ధి అంచనాలు పెంపు..

వడ్డీ రేట్లను 5.25శాతం వద్ద యథాతంగా ఉంచింది ఆర్బీఐ. మూడు రోజుల మానిటరీ పాలసీ సమావేశం అనంతరం శుక్రవారం ఉదయం ఈ ప్రకటన చేసింది. కాగా జీడీపీ వృద్ధి- ద్రవ్యోల్బణ అంచనాలను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా పెంచింది.

Published on: Feb 06, 2026 10:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా శుక్రవారం ఉదయం ఈ ప్రకటన చేశారు.

ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా..
ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా..

ఈ దఫా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25శాతం వద్ద ఉంది. పాలసీ వైఖరీని కూడా న్యూట్రల్​లో కొనసాగించింది.

“దేశ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అసెస్​ చేసిన తర్వాత, వడ్డీ రేట్లను 5.25శాతం వద్దే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది,” అని ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా వెల్లడించారు.

బడ్జెట్​ 2026 తర్వాత జరిగిన తొలి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండదు అనే అంచనాలే మార్కెట్​లో ఉన్నాయి. ఈసారి రెపో రేట్​ కట్​ ఉండదని బ్లూమ్​బర్గ్​ సర్వే చేసిన ఎకనామిస్ట్​లలో 39 మంది అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంతో పాటు భారత జీడీపీ పరుగులు తీస్తున్న వేళ.. ఇక మీదట అసలు వడ్డీ రేట్ల కోత అనేదే ఉండదని మరికొందరు అంచనా వేశారు.

ఈసారి రెపో రేట్​ కట్​ లేకపోయినా.. గతేడాది ఫిబ్రవరి నుంచి చూసుకుంటే వడ్డీ రేట్లను ఆర్బీఐ ఇప్పటికే 125 బేసిస్​ పాయింట్లను తగ్గించింది. ఈ స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గించడం 2019 తర్వాత ఇదే తొలిసారి! చివరిగా, గత డిసెంబర్​లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో 25 బేసిస్​ పాయింట్ల కట్​ని ప్రకటించింది. ఫలితంగా, అప్పుడు రెపో రేటు 5.50శాతం నుంచి 5.25శాతానికి దిగొచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది.

భారత దేశ జీడీపీ అంచనాలు పెంపు..

ఎఫ్​వై2025-26కి సంబంధించిన భారత దేశ జీడీపీ వృద్ధి అంచనాలను 7.3శాతం నుంచి 7.4శాతానికి పెంచింది ఆర్బీఐ. బడ్జెట్​ 2026లో భాగంగా గత వారం వెలువడిన ఆర్థిక సర్వేలో పేర్కొన్న 6.8శాతం- 7.2శాతం కన్నా ఇది ఎక్కువ.

భారత్​-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండియా-యూఎస్​ ట్రేడ్​ డీల్​పై కీలక ప్రకటన వెలువడటం దేశానికి సానుకూల విషయాలు అని ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా వివరించారు.

మరోవైపు ఎఫ్​వై2025-26కి సంబంధించిన ద్రవ్యోల్బణ అంచనాలను 2శాతం నుంచి 2.1శాతానికి పెంచింది రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. దేశంలో ప్రస్తుతం పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయని, ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెద్దగా పెరగపోవచ్చని ఆర్బీఐ గవర్నర్​ అభిప్రాయపడ్డారు. కానీ అంతర్జాతీయ అనిశ్చితిపై ఫోకస్​ చేయాలని తెలిపారు.

నష్టాల్లో స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో బీఎస్​ఈ సెన్సెక్స్​ 342 పాయింట్ల నష్టంతో 82,972 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50.. 129 పాయింట్ల కోల్పోయి 25,515 వద్ద కొనసాగుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More