వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు నేడే.. ఈఎంఐల భారం పెరుగుతుందా? సంజయ్ మల్హోత్రా ఏం చెప్పబోతున్నారు?

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలు నేడు వెలువడనున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడిచమురు ధరల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు రెపో రేటుపై కీలక ప్రకటన చేయనున్నారు.

Published on: Oct 7, 2026, 07:02:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం (అక్టోబర్ 7) ఉదయం 10 గంటలకు ద్రవ్య పరపతి నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగు పాలసీ సమీక్షలుగా 5.25 శాతంగా కొనసాగుతున్న రెపో రేటుపై ఈసారి పెంపు దిశగా నిర్ణయం ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు నేడే.. ఈఎంఐల భారం పెరుగుతుందా? సంజయ్ మల్హోత్రా ఏం చెప్పబోతున్నారు?
వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు నేడే.. ఈఎంఐల భారం పెరుగుతుందా? సంజయ్ మల్హోత్రా ఏం చెప్పబోతున్నారు?

ఎప్పుడు, ఎక్కడ లైవ్ చూడవచ్చు?

ఆర్బీఐ గవర్నర్ నిర్ణయాల ప్రకటనను బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి ఆర్బీఐ అధికారిక యూట్యూబ్ (YouTube) ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు గవర్నర్‌తో పాటు ఎంపీసీ సభ్యులు పాల్గొనే విలేకరుల సమావేశం కూడా ఇదే వేదికపై ప్రసారమవుతుంది.

గ్లోబల్ సవాళ్లు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం

గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఎగిసిపడుతున్న ముడిచమురు ధరలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపాయి. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ఇది సవాలుగా మారింది.

గత ఆగస్టు నెలలో జరిగిన ఎంపీసీ భేటీలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్దే ఉంచుతూ 'తటస్థ' (Neutral) వైఖరిని అవలంబించింది. అయితే, వర్షపాతం, ద్రవ్యోల్బణ పరిస్థితులను సమీక్షించిన అనంతరం ప్రస్తుత కఠిన వాతావరణంలో వడ్డీ రేట్ల పెంపు వైపు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాలుగేళ్ల తర్వాత తొలి పెంపు ఉండేనా?

2025లో ఆర్బీఐ వరుసగా 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. చివరిసారిగా ఫిబ్రవరి 2023లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చారు. ఒకవేళ నేడు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచితే, అది నాలుగేళ్ల కాలంలో తొలి పెంపు కానుంది.

"ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా ఆర్బీఐ ఈ దఫా రెపో రేటును 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది" అని బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అవినాష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. "అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలను ఆర్బీఐ యథాతథంగా అనుసరించదు. మన దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు, మార్కెట్ లిక్విడిటీ ఆధారంగానే ఆర్బీఐ నిర్ణయాలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More