IPL 2026: బెంగళూరు ఫ్యాన్స్‌కు షాక్.. హోమ్ గ్రౌండ్‌ను మారుస్తున్న ఆర్సీబీ?

ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఆర్సీబీ తన సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంకు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గతేడాది జరిగిన తొక్కిసలాట ఇందుకు కారణం అని తెలుస్తోంది.

Published on: Jan 9, 2026, 06:45:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరు, కర్ణాటక ఫ్యాన్స్​కి రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు (ఆర్సీబీ) పెద్ద షాక్​ ఇచ్చేడట్టే కనిపిస్తోంది! 2008లో ఐపీఎల్​ ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంను హోమ్​ గ్రౌండ్​గా చేసుకుని ఆడుతున్న ఆ జట్టు.. ఈసారి మాత్రం వెన్యూను షిఫ్ట్​ చేసే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఐపీఎల్​ 2026లో విరాట్ కోహ్లీ అండ్ టిమ్​.. చిన్నస్వామి స్టేడియంలో కనిపించకపోవచ్చు.

బెంగళూరుకు ఆర్సీబీఐ గుడ్​బై? (AFP)
బెంగళూరుకు ఆర్సీబీఐ గుడ్​బై? (AFP)

హోమ్​ గ్రౌండ్​ని ఆర్సీబీ షిఫ్ట్​ చేయడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2025​ ట్రోఫీ విక్టరీ సెలబ్రేషన్స్​లో తొక్కిసలాట అని నివేదికలు చెబుతున్నాయి.

చిన్నస్వామి స్టేడియంకు ఎందుకు దూరం?

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025​ ట్రోఫీని విరాట్​ కోహ్లీ ఆర్సీబీ దక్కించుకుంది. కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్​కి ఇది ఒక మరపురాని జ్ఞాపకం. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు నిలవలేదు! బెంగళూరులో జరిగిన విక్టరీ సెలబ్రేషన్స్​లో తొక్కిసలాట జరిగి, 11 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా షాక్​కి గురిచేసింది.

ఈ సంఘటన ఆర్సీబీ జట్టుకు తీవ్రమైన ప్రతికూల ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఘటన వల్ల కలిగిన చెడ్డ పేరు దృష్ట్యా, రాబోయే సీజన్‌లో బెంగళూరులో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఫ్రాంచైజీ సుముఖంగా లేదని తెలుస్తోంది.

ఐపీఎల్​ 2026 నిర్వహణ గురించి ఇప్పటివరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్​సీఏ)ను ఆర్సీబీ యాజమాన్యం సంప్రదించకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది.

డిసెంబర్ 24న దిల్లీ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ను కూడా చివరి నిమిషంలో చిన్నస్వామి స్టేడియం నుంచి మార్చేశారు. ఈ మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ ఆడాడు.

బెంగళూరు కాకపోతే- ఇంకెక్కడ?

ప్రస్తుతానికి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ మైదానం ఆర్సీబీ కొత్త 'హోమ్ గ్రౌండ్' రేసులో ముందుండగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కూడా పరిశీలనలో ఉంది.

మార్చ్​ చివరి నుంచి ఐపీఎల్ 2026​ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్సీబీ హోమ్​ గ్రౌండ్​ షిఫ్ట్​ వ్యవహారంపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రాజస్థాన్ రాయల్స్ కూడా..

ఈ ఐపీఎల్​ 2026లో హోమ్​ గ్రౌండ్​ని మారుస్తున్న జట్టు ఆర్సీబీ ఒక్కటే కాకపోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్​) సైతం తమ సొంత గడ్డను వీడుతోంది! జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంకు బదులుగా, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియంలో తమ హోమ్ మ్యాచ్‌లను ఆడాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్​సీఏ)తో ఉన్న విభేదాలే దీనికి ప్రధాన కారణం.

2025 సీజన్ సమయంలో ఒక ఆర్​సీఏ అధికారి జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఆరోపణలను ఖండించిన ఫ్రాంచైజీ, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘర్షణల నేపథ్యంలోనే జట్టు హోమ్​ గ్రౌండ్​ని పుణెకు మార్చాలని నిర్ణయించారు.

గతంలో పుణె స్టేడియం పుణె వారియర్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ వంటి జట్లకు ఆతిథ్యం ఇచ్చిన అనుభవం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More