RCB vs KKR : విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ... కోల్‌కతాకు మరో ఓటమి..! టేబుల్​ టాప్​లో ఆర్సీబీ టీమ్

RCB vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో కేకేసీఆర్ కు ఆర్సీబీ మరో షాక్ ఇచ్చింది. రాయ్‌పూర్‌లో మ్యాచ్‌లో కోహ్లీ అజేయ సెంచరీతో 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టీమ్ అగ్రస్థానానికి చేరుకుంది.

Published on: May 14, 2026, 06:58:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సత్తా చాటుతోంది. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ…. జట్టును విజయతీరాలకు చేర్చాడు.

విరాట్ కోహ్లీ విధ్వంసకర సెంచరీ: కోల్‌కతాపై ఆర్‌సీబీ ఘనవిజయం
విరాట్ కోహ్లీ విధ్వంసకర సెంచరీ: కోల్‌కతాపై ఆర్‌సీబీ ఘనవిజయం

193 పరుగుల భారీ లక్ష్యంతో ఆర్సీబీ చేజింగ్ కు దిగింది. గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్…. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (15) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా…. కార్తీక్ త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతికి అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (39) కోహ్లీకి అద్భుతమైన సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించడంతో ఆర్‌సీబీ విజయం తేలికైంది. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 101/1గా నమోదైంది.

మధ్యలో తడబాటు…..

కార్తీక్ త్యాగి తన రెండో స్పెల్‌లో పడిక్కల్‌ను అవుట్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (11), టిమ్ డేవిడ్ (2) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా మనీష్ పాండే పట్టిన అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్‌కు టిమ్ డేవిడ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

ఒకవైపు వికెట్లు పడుతున్నా, విరాట్ కోహ్లీ మాత్రం పట్టు వదల్లేదు. 19వ ఓవర్‌లో తన ఐపీఎల్ కెరీర్‌లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆఖరి ఓవర్‌లో జిితేష్ శర్మ ఫోర్ కొట్టడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ గెలుపొందింది. కేకేఆర్ బౌలర్లలో త్యాగి (4 ఓవర్లలో 3/32), సునీల్ నరైన్ (4 ఓవర్లలో 01/31) మాత్రమే వికెట్లు తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (18) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా…. భువనేశ్వర్ కుమార్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం అజింక్యా రహానే (19), యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రఘువంశీ (50+) ఈ సీజన్‌లో తన నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేసి, 21 ఏళ్ల లోపు వయసులో ఒకే సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన కేకేఆర్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించగలిగింది.

ఈ విజయంతో ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక గుజరాత్ కూడా 16 పాయింట్ల సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హైదరాబాద్, నాల్గో స్థానంలో పంజాబ్ ఉండగా…ఐదో స్థానంలో చెన్నై టీమ్ ఉంది.

ఇక బెంగళూరుపై ఓటమి చెందటంతో కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు మరింత సన్నగిల్లయ్యాయి. 11 మ్యాచుల్లో 4 విజయాలతో 9 పాయింట్లు మాత్రం సాధించినట్లు అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేసీఆర్… 8వ స్థానానికి పడిపోయింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More