...
...
Next Story

NEET UG 2026 : ఏ క్షణంలోనైనా నీట్​ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫైనల్​ ఆన్సర్ కీ! ఫలితాలెప్పుడు?

Re NEET 2026 Final Answer Key : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రీ-నీట్ 2026 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ కీ ఆధారంగానే జూలై 20న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published on: Jul 11, 2026, 12:58:37 IST
Advertisement

నీట్ యూజీ 2026​ రీ-ఎగ్జామినేషన్ ఫైనల్ ఆన్సర్​ కీ ఇంకొన్ని గంటల్లో విడుదల అవుతుందని తెలుస్తోంది. మరోవైపు వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఈ పరీక్ష ఫలితాల ప్రకటనకు ఎన్టీఏ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఈ రీ-ఎగ్జామ్ తుది సమాధానాల కీతో పాటు అభ్యర్థుల ఓఎమ్‌ఆర్ రెస్పాన్స్ షీట్, స్కోర్‌కార్డులను కూడా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

జులై 20న రీ-నీట్ ఫలితాలు?

నీట్​ యూజీ 2026 ఎగ్జామినేషన్ సెంటర్..
నీట్​ యూజీ 2026 ఎగ్జామినేషన్ సెంటర్..

ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన కొన్ని రోజులకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ 2026 ఫలితాలను కూడా వెల్లడించడానికి అధికారులు కసరత్తు పూర్తి చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ ఫలితాలు జులై 20వ తేదీన విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఎన్టీఏ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ముందస్తు ప్రకటన రాలేదు.

గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్ (ప్రాథమిక) కీపై విద్యార్థుల నుంచి అందిన అభ్యంతరాలు, ఫిర్యాదులను సబ్జెక్ట్ నిపుణుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ అభ్యంతరాల ఆధారంగా రూపొందించిన ఈ ఫైనల్ కీ ఆధారంగానే విద్యార్థుల మార్కులను లెక్కించి, తుది ఫలితాలను, ర్యాంకులను ఖరారు చేస్తారు.

ఓఎమ్‌ఆర్ షీట్, ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను సులభంగా చూసుకోవడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించవచ్చు:

  • మొదట ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'Re-NEET 2026 OMR Sheet' లేదా 'Result' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే లాగిన్ పేజీలో మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు సబ్మిట్ చేయగానే మీ ఓఎమ్‌ఆర్ షీట్, ఫైనల్ కీ, స్కోర్‌కార్డు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
  • భవిష్యత్తులో మెడికల్ కౌన్సెలింగ్ అవసరాల కోసం దీనిని ఒక ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోవడం మంచిది.

ఫైనల్ కీలో ఏ ఏ వివరాలు ఉంటాయి?

ఈ ఫైనల్ కీ, ఓఎమ్‌ఆర్ షీట్ ద్వారా విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే తమకు వచ్చే మార్కులపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు. ఫలితాల ప్రకటన, తదుపరి అడ్మిషన్ల షెడ్యూల్ కోసం విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మకుండా, కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe