భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ లైఫ్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినియోగదారుల అంచనాలను, అభిప్రాయాలను అర్థం చేసుకునన ప్రముఖ మొబైల్ దిగ్గజం ‘రియల్‌మీ’.. త్వరలోనే ఒక భారీ ఆయుధాన్ని దేశీయ మార్కెట్లోకి దించేందుకు సిద్ధమవుతోంది! ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్లలో 5,000ఎంఏహెచ్ లేదా 6,000ఎంఏహెచ్ బ్యాటరీలను ఎక్కువగా చూశాం. అయితే వీటన్నింటికీ భిన్నంగా ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త ప్రో సిరీస్‌ని పరిచయం చేయడానికి కంపెనీ కసరత్తు చేస్తోంది.

ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ వీటి పేర్లు ‘రియల్‌మీ 17 ప్రో’ లేదా ‘రియల్‌మీ 17 ప్రో ప్లస్’ ఉండొచ్చని, ఇవి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రముఖ టిప్‌స్టర్ దేబాయన్ రాయ్ తన 'ఎక్స' (ట్విట్టర్) ఖాతా వేదికగా వివరాలను వెల్లడించారు.
రియల్‌మీ 17 ప్రో- భారీ బ్యాటరీ..
సాధారణంగా నిరంతరం గేమింగ్ ఆడేవారికి, సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, రోజంతా ఓటీటీ కంటెంట్ చూసేవారికి పవర్ బ్యాంక్ వెంట ఉంచుకోవడం అలవాటు. కానీ ఈ 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ అందుబాటులోకి వస్తే రెండు నుంచి మూడు రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు.
ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి వచ్చిన 'రియల్‌మీ 16 ప్రో', 'రియల్‌మీ 16 ప్రో ప్లస్' మోడళ్లలో 7,000ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న 17 ప్రో సిరీస్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని ఏకంగా 10,000ఎంఏహెచ్‌కు పెంచనుండటం మొబైల్ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది.
రియల్‌మీ 17 ప్రో సిరీసీ- 200ఎంపీ కెమెరా..!
బ్యాటరీ ఒక్కటే కాదు, కెమెరా, డిస్ప్లే విభాగాల్లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. వెనుకవైపు ట్రిపుపుల్ కెమెరా సెటప్‌ను అందించబోతున్నారు.
- ప్రధాన కెమెరా: 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
- టెలిఫోటో కెమెరా: 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరా
- అల్ట్రా-వైడ్ కెమెరా: అదనంగా మరో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్
బ్యాటరీ ఒక్కటే కాదు, కెమెరా, డిస్ప్లే విభాగాల్లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. వెనుకవైపు ట్రిపుపుల్ కెమెరా సెటప్‌ను అందించబోతున్నారు.
- ప్రధాన కెమెరా: 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
- టెలిఫోటో కెమెరా: 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరా
- అల్ట్రా-వైడ్ కెమెరా: అదనంగా మరో అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్
స్క్రీన్ విషయానికొస్తే, ఇందులో 1.5కే రెజల్యూషన్ కలిగిన ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది సాధారణంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా కొన్ని ఎంపిక చేసిన గేమ్‌లలో ఏకంగా 165హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్ అందించేలా ఈ స్క్రీన్‌ను డిజైన్ చేస్తున్నారు.
రియల్‌మీ 17 ప్రో- పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రాణవాయువుగా మీడియాటెక్ ‘డైమెన్సిటీ 7500’ 5జీ చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ బాడీ ప్రీమియం ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రానుంది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ 16 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.31,999 కాగా, రియల్‌మీ 16 ప్రో+ 5G ధర రూ.39,999గా ఉంది. వీటిలో 200ఎంపీ కెమెరా, డైమెన్సిటీ 7300 మాక్స్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్లను ఉపయోగించారు. కొత్తగా రాబోయే 17 ప్రో సిరీస్ కూడా రూ.35,000 నుంచి రూ.42,000ల బడ్జెట్ పరిధిలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఈ రియల్‌మీ 17 ప్రో సిరీస్ పూర్తి వివరాల కోసం రియల్‌మీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే.