రూ. 14,999 ధరకే 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- Realme C85 హైలైట్స్​ ఇవే..

భారత్‌లో రియల్​మీ సీ85 5జీ లాంచ్‌ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 14,999. ఇందులో 7,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 29, 2025, 05:44:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రియల్‌మీ సంస్థ భారత మార్కెట్లో తన బడ్జెట్-ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్​మీ సీ85 5జీను విడుదల చేసింది. ఈ ఫోన్​ సేల్​ డిసెంబర్​ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు దీన్ని రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు ఇతర ముఖ్యమైన ఫీచర్స్​తో వస్తోంది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రియల్​మీ సీ85 5జీ.. (Realme)
రియల్​మీ సీ85 5జీ.. (Realme)

రియల్​మీ సీ85 5జీ- ధర, లభ్యత..

రియల్​మీ సీ85 5జీ స్మార్ట్​ఫోన్​ ప్రారంభ ధర రూ. 14,999గా ఉంది. ఇది 4జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు సంబంధించిన ధర.

అదే విధంగా, అధిక సామర్థ్యం గల 6జీబీ ర్యామ్​, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 16,499గా నిర్ణయించారు.

ఈ ఫోన్ అమ్మకాలు డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి. ఈ డివైజ్ ప్యారెట్ పర్పుల్, పీకాక్ గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

రియల్​మీ సీ85 5జీ- ప్రధాన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ప్రాసెసర్: రియల్​మీ సీ85 5జీ శక్తివంతమైన మీడియాటెక్​ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి గరిష్ఠంగా 6జీబీ ర్యామ్​ కనెక్ట్​ చేసి ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఇది ఆండ్రాయిడ్​ 15 ఆధారిత రియల్​మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరా: ఫొటోగ్రఫీ కోసం, ఈ మొబైల్‌లో 50ఎంపీ ప్రధాన వెనుక కెమెరా ఉంది. ఇది తక్షణ ఫొటో సర్దుబాట్లకు (క్విక్ ఫొటో అడ్జస్ట్‌మెంట్స్‌) మద్దతు ఇచ్చే ఏఐ ఎడిటింగ్ టూల్‌తో వస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్: రియల్​మీ సీ85 5జీ లోపల 7000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. రియల్‌మీ చెప్పిన దాని ప్రకారం, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదు. ఈ డివైజ్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మరియు 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

ఇవే కాకుండా, ఈ మొబైల్‌లో ఐపీ69 ప్రో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి మన్నిక ఫీచర్లు కూడా ఉన్నాయి. రియల్‌మీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డివైజ్‌ని 30 నిమిషాల పాటు 6 మీటర్ల లోతు నీటిలో ముంచి పరీక్షించారు. అంతేకాక, వివిధ రకాల ద్రవాల నుంచి కూడా రక్షణను అందిస్తుంది.

ఇది MIL-STD 810H సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. దీని అర్థం, 2 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా తట్టుకోగల డ్రాప్ రెసిస్టెన్స్ ఈ ఫోన్‌కు ఉంది.

ఈ సీ85 5జీ ఫోన్ మన్నిక సామర్థ్యాలను చాటుతూ.. "స్మార్ట్​ఫోన్ నీటి నిరోధకత పరీక్షను నిర్వహించిన అత్యధిక వ్యక్తులు" అనే విభాగంలో కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడిందని రియల్‌మీ పేర్కొంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More