10,000ఎంఏహెచ్ బ్యాటరీతో Redmi Note 17 Pro Max 5G- అదిరిపోయే ఫీచర్లు ఇవి..
షావోమీ బ్రాండ్ నుంచి తొలిసారిగా 10,000ఎంఏహెచ్ భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీతో 'రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5జీ' మార్కెట్లోకి వచ్చింది. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఐపీ68 రేటింగ్‌తో వచ్చిన ఈ ఫోన్ వివరాలు మీకోసం..
భారత మార్కెట్లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకునే 'రెడ్‌మీ నోట్' సిరీస్ నుంచి షావోమీ మరో శక్తివంతమైన మోడల్‌ను పరిచయం చేసింది. జపాన్‌తో పాటు ఎంపిక చేసిన కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో 'రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5జీ' ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇప్పటివరకు వచ్చిన రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లలోనే కాకుండా, షావోమీ చరిత్రలోనే 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.

రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్- భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్..
నిత్యం ప్రయాణాలు చేసేవారికి, రోజంతా ఫోన్ వాడే హెవీ యూజర్లకు ఛార్జింగ్ సమస్య లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపుదిద్దారు. ఇందులో ఏకంగా 10,000ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ద్వారా ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు 27డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందించారు.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్- డిస్‌ప్లే, ప్రాసెసర్..
ఈ రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ 6.83 ఇంచుల 1.5కే అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో తీవ్రమైన ఎండలోనూ స్పష్టంగా కనిపించేలా రూపకల్పన చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో పాటు 'వెట్ టచ్ టెక్నాలజీ 2.0' వల్ల చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ సులభంగా పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌పై నడిచే ఈ హ్యాండ్‌సెట్‌లో 8జీబీ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘హైపర్ ఓఎస్ 3’పై పనిచేస్తుంది.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్- కెమెరా, ఏఐ ఫీచర్లు..
ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెండు కూడా 4కే వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. ఏఐ ఎరేజర్ ప్రో, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవల్, ఏఐ స్కై వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లతో పాటు గూగుల్ జెమినీ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్- వాటర్ రెసిస్టెన్స్, కనెక్టివిటీ..
దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఈ రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఐపీ66, ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్‌స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 5జీ, వైఫై 6, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్- ధర, లభ్యత..
జపాన్ మార్కెట్లో 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర జేపీవై 79,980 (సుమారు రూ. 47,900) కాగా, 8జీబీ + 512జీబీ వేరియంట్ ధర జేపీవై 99,980 (సుమారు రూ. 59,900)గా నిర్ణయించారు. క్లౌడ్‌బ్రష్, పర్పుల్, బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది.
"సెప్టెంబరు 15న భారతదేశంలో రెడ్‌మీ నోట్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లను పరిచయం చేసే అవకాశం ఉంది," అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత మార్కెట్లోకి వచ్చాక రూ. 40,000 - రూ. 50,000 ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


